UP Gutka groom : గుట్కా నమిలే మొగుడు నాకెందుకు..? తెగేసి చెప్పిన పెళ్లికూతురు..! పీఠలపై ఆగిన పెళ్లి..

|

Jun 09, 2021 | 5:07 PM

UP Gutka groom : పెళ్లంటే నూరేళ్ల పంట. ఏడడుగులు వేసాక ఏడు జన్మలు కలిసుండే బంధం. అలాంటి శుభకార్యం

UP Gutka groom : గుట్కా నమిలే మొగుడు నాకెందుకు..? తెగేసి చెప్పిన పెళ్లికూతురు..! పీఠలపై ఆగిన పెళ్లి..
Up Gutka Groom
Follow us on

UP Gutka groom : పెళ్లంటే నూరేళ్ల పంట. ఏడడుగులు వేసాక ఏడు జన్మలు కలిసుండే బంధం. అలాంటి శుభకార్యం ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. అందుకే వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అలాంటి వివాహ వేడుకలు ఇటీవల రెండు మూడు పీఠల దాకా వచ్చి ఆగిపోయాయి. దీనికి కారణం పెళ్లికొడుకు ప్రవర్తన, అలవాట్లు సరిగ్గా లేకపోవడం. దీంతో తెలివైన అమ్మాయిలు పెళ్లి మండపంలోనే వివాహం రద్దు చేసుకొని వెళ్లిపోతున్నారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగింది.

బాలియా జిల్లాలోని మిశ్రౌలి గ్రామానికి చెందిన ఓ యువ‌తికి కేజూరి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. జూన్ 5న పెళ్లితంతు నిర్వహించాలని అనుకున్నారు. ఆ రోజు పెళ్లి చేసుకోవటానికి వరుడు వధువు ఇంటికి ఊరేగింపుగా వచ్చాడు. అలా వస్తూ వస్తూ వరుడు నోట్లో గుట్కా పెట్టుకుని నములుతూ వచ్చాడు. ఊరేగింపులో ఓకే.. కానీ పెళ్లి మండపానికి కూడా గుట్కా వేసుకునే వచ్చాడు. ముహూర్తం దగ్గరపడుతున్నా కనీసం నోరు శుభ్రం చేసుకోవడం లేదు. దీంతో పెళ్లి కూతురు కోపం వచ్చింది. ‘‘ గుట్కా న‌మ‌ల‌డం నాకు న‌చ్చదని’ తెగేసి చెప్పింది అయినా అతడు వినలేదు. ఇంకేముంది. గుట్కా నమిలేవాడిని నేను పెళ్లి చేసుకోను అని కచ్చితంగా చెప్పి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయింది. అదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించింది. పీఠలపై జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుకు తిక్క కుదరినట్లయిందని పెళ్లికి వచ్చిన అందరు అభిప్రాయ పడ్డారు.

Weather Report: మరింతగా విస్తరించనున్న రుతుపవనాలు.. రాగల మూడు రోజుల్లో ఏపీలో వర్ష సూచన

TV9 Focus: నాన్న కళ్ళతో చూసిన భవిష్యత్ కరోనా కాటుతో కనిపించకుండా పోయింది.. కన్నీటి కథలపై ప్రత్యేక కథనం!

Vijayasai reddy : ‘అచ్చెన్న కాలజ్ఞానం నిజమే అనిపిస్తోంది.. టీడీపి తెలంగాణా అధ్యక్షుడు తెరాసలోకి జంప్ అట’ : విజయసాయి