Viral Photo: ఆమె కళ్లను చూస్తుంటే కనురెప్ప కూడా వేయాలనిపించదు.. కనికట్టు చేసే ఈ సుందరి ఎవరో కనిపెట్టండి..?

ముసుగు మాటున దాగిన ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు . ఆ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టండి.

Viral Photo: ఆమె కళ్లను చూస్తుంటే కనురెప్ప కూడా వేయాలనిపించదు.. కనికట్టు చేసే ఈ సుందరి ఎవరో కనిపెట్టండి..?
Actress

Updated on: Aug 18, 2022 | 11:49 AM

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సినీతారలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్, రేర్ ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే పలువురు తారలకు చెందిన అరుదైన పిక్స్ నెట్టింట వైరల్ అవుతాయి. తమ ఫేవరెట్ హీరోహీరోయిన్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ బుధవారం నుంచి ఓ అందమైన ఫోటో నెట్టింటిని షేక్ చేస్తుంది. కాటుక కళ్లు నెటిజన్స్‏ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముసుగు మాటున దాగిన ఆ అందాల ముద్దుగుమ్మ ఎవరో తెలుసుకోవడానికి నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు . ఆ హీరోయిన్ ఎవరో మీరు గుర్తుపట్టండి.

ముసుగు మాటున మోము.. కాటుక కళ్లతోనే కట్టిపడేస్తున్న ఈ చిన్నది దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికలలో ఒకరు. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే ఓ సూపర్ హిట్ సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఎవరో గుర్తుపట్టండి.

ఇవి కూడా చదవండి

ఆ కలువ కళ్ల చిన్నది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. అఆ సినిమాతో తెలుగు తెర అరంగేట్రం చేసిన అమ్మడు.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తాజాగా నిఖిల్ సరసన కార్తీకేయ 2లో కనిపించింది. ఆగస్ట్ 13న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భారీగా వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us