Viral Video: సో క్యూట్ .. లవ్లీ సర్‌‌ప్రైజ్ ఇచ్చిన వరుడు.. నవ వధువు ఫిదా!

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కరోనా, లాక్‌డౌన్‌ టైమ్‌ నుండి..వెడ్డింగ్ వీడియోలు..మరింత ట్రెండ్‌ అవుతున్నాయి.

Viral Video: సో క్యూట్ .. లవ్లీ సర్‌‌ప్రైజ్ ఇచ్చిన వరుడు.. నవ వధువు ఫిదా!
Groom Dance

Updated on: Mar 20, 2022 | 2:21 PM

Trending Video: సోషల్ మీడియా(Social Media)లో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా కరోనా, లాక్‌డౌన్‌ టైమ్‌ నుండి..వెడ్డింగ్ వీడియోలు..మరింత ట్రెండ్‌ అవుతున్నాయి..లేటెస్ట్ గా ఇంటర్‌నెట్‌ వేదికగా ఓ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో వరుడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పెళ్లి పందిట్లో వధూవరుల వెనుక కుటుంబ సభ్యులు కూర్చుని ఉన్నారు. అయితే పెళ్లికొడుకు వధువుకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాలని ముందుగానే ప్లాన్ చేశాడు. తనకు కాబోయే భార్యకు లవ్లీ సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నాడు. దాంతో వెంటనే లేచి అక్కడి నుంచి కొంతదూరం నడిచాక, డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్యూట్ లిటిల్ సర్ ప్రైజ్ చూసి పెళ్లికూతురే కాదు.. పక్కన ఉన్నవారంతా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఓ గులాబీ పువ్వు తీసుకుని లవ్ ప్రపోజ్ చేశాడు. ఆ వెంటనే వరుడు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. ఈ అందమైన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేయగా, నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ‘వధువును సర్ ప్రైజ్ చేయాలనుకున్నాడు.. తన నటనతో వరుడు అందరినీ ఆశ్చర్యపరిచాడు’ అంటూ నెటిజన్ల భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి అబ్బాయిని చేసుకోవడం ఆ అమ్మాయి అదృష్టమే అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Clay Water Pot : ఫ్రిజ్ వాటర్ వద్దు.. మట్టి కుండలో నీరు తాగవోయ్.. గట్టి మేలు తలపెట్టవోయ్

Loading...
Unable to load recommendations.
Follow Us