Viral Photo: దేశ రక్షణ కోసం నేను సైతం.. AK-47 చేతబట్టిన 79 ఏళ్ల బామ్మ.. నెట్టింట వైరల్

|

Feb 17, 2022 | 10:12 AM

Great-Grandmother Training With AK-47: రష్యా దండయాత్రను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ పౌరులు, వృద్ధులు సైతం రంగంలోకి దిగారు. తాజాగా.. సోషల్ మీడియా (Social Media) లో ఓ ఫోటో చాలా వేగంగా వైరల్ అవుతోంది.

Viral Photo: దేశ రక్షణ కోసం నేను సైతం.. AK-47 చేతబట్టిన 79 ఏళ్ల బామ్మ.. నెట్టింట వైరల్
Viral Photo
Follow us on

Ukraine-Russia Tension: రష్యా- ఉక్రెయిన్ (Ukraine-Russia) సరిహద్దుల్లో కొన్ని రోజుల నుంచి టెన్షన్ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. రష్యా ఉక్రెయిన్‌పై ఎప్పుడైనా దాడి చేసే అవకాశముందంటూ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఇరు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అమెరికా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడారు. దీంతో రష్యా వెనక్కి తగ్గింది. సరిహద్దుల నుంచి సైన్యాన్ని క్రమంగా ఉపసంహరించుకుంటున్నట్లు రష్యా తెలిపింది. అయితే.. రష్యా దండయాత్రను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ పౌరులు, వృద్ధులు సైతం రంగంలోకి దిగారు. తాజాగా.. సోషల్ మీడియా (Social Media) లో ఓ ఫోటో చాలా వేగంగా వైరల్ అవుతోంది. 79 ఏళ్ల వృద్ధురాలు ఏకే-47 వంటి ఆయుధం చేతబట్టి కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని (Viral Photo) చాలా మంది నెటిజన్లు షేర్ చేయడంతోపాటు కామెంట్లు చేస్తున్నారు.

డైలీమెయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. రష్యా దాడి చేసే అవకాశం ఉన్నందున అత్యవసర పరిస్థితుల్లో పోరాటంలో పాల్గొనడానికి ఆయుధాలను చేతబట్టమని ఉక్రెయిన్ ప్రభుత్వం పౌరులకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఉక్రేనియన్ ప్రభుత్వం తన పౌరులకు శిక్షణ ఇస్తోంది. ఇందులో సాధారణ ప్రజలకు AK-47ను ఆపరేట్ చేయడం నేర్పుతున్నారు. శిక్షణా శిబిరంలో దాదాపు 79 ఏళ్ల వయసున్న వృద్ధురాలు కూడా ఉంది. ఆమె తన దేశాన్ని రక్షించుకోవడానికి AK-47తో కాల్పులు జరపడం నేర్చుకుంటుంది. ఈ క్రమంలో తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


యువతే.. దేశం కోసం పోరాటం చేయాలా..? నేను కూడా చేస్తానంటూ 79 ఏళ్ల వాలెంటినా కాన్‌స్టాంటినోవ్‌స్కా శిక్షణ శిబిరానికి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వాలెంటినా కాన్‌స్టాంటినోవ్‌స్కా మీడియాతో మాట్లాడుతూ.. పరిస్థితి మరింత దిగజారితే నేను కూడా కాల్పులు జరపడానికి సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొంది. నేను నా ఇంటిని, నా నగరాన్ని, నా పిల్లలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పేర్కొన్నారు. నా దేశాన్ని, నా నగరాన్ని కోల్పోవడం నాకు ఇష్టం లేదంటూ పేర్కొన్నారు.

Also Read:

Viral News: పాత బట్టలు అమ్ముతూ లక్షలు సంపాదిస్తోన్న యువతి.. తినడానికి తిండి లేని స్థాయి నుంచి లక్షాధికారిగా..

Gold Auction: రూ. 2800 కోట్ల విలువైన బంగారాన్ని అమ్మేసిన కంపెనీ.. కారణమేంటంటే..