Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పాత బట్టలు అమ్ముతూ లక్షలు సంపాదిస్తోన్న యువతి.. తినడానికి తిండి లేని స్థాయి నుంచి లక్షాధికారిగా..

జీవితం భలే విచిత్రంగా ఉంటుంది. ముళ్లదారిలో కష్టాలకు ఎదురెళితే ఆ తర్వాత అందమైన పూలబాట వస్తోంది అంటారు. జీవితంలో ఎదుర్కోనే ప్రతి పరిస్థితికి.

Viral News: పాత బట్టలు అమ్ముతూ లక్షలు సంపాదిస్తోన్న యువతి.. తినడానికి తిండి లేని స్థాయి నుంచి లక్షాధికారిగా..
Holly Marie
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 17, 2022 | 9:12 AM

జీవితం భలే విచిత్రంగా ఉంటుంది. ముళ్లదారిలో కష్టాలకు ఎదురెళితే ఆ తర్వాత అందమైన పూలబాట వస్తోంది అంటారు. జీవితంలో ఎదుర్కోనే ప్రతి పరిస్థితికి.. సరైనా సమాధానాలు మన ఆలోచనలే. ఏమి లేని వాడిని ఉన్నతంగా తీర్చిదిదేది కూడా ఆ ఒక్క ఆలోచనే.. తీసుకునే నిర్ణయాలే నీ జీవితాన్ని నిర్ణయిస్తాయి. అలాంటి ఓ వినూత్నమైన ఆలోచనే… ఇప్పుడు ఆ యువతిని ఏకంగా లక్షాధికారిని చేసింది. తినడానికి తిండి కూడా లేని స్థాయి నుంచి ఇప్పుడు వందల మంది ఆకలి తీర్చే స్థాయికి చేరుకుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసింది.. తన దుర్భర జీవితాన్ని అద్భుతంగా మార్చిన ఆ ఆలోచన ఏంటో తెలుసుకుందామా.

మిర్రర్ నివేదిక ప్రకారం..  యునైటెడ్ కింగ్ డమ్‏లో నివసిస్తున్న హోలీ మేరీ అనే అమ్మాయి డబ్బు సంపాదన కోసం ఇప్పుడు వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. దీంతో జీవితం పూర్తిగా మారిపోయింది. 18 ఏళ్ల హోలీ మేరీ ఓ స్టూడెంట్. ఈ యువతి ఇప్పుడు పాత బట్టలను అమ్ముతూ లక్షలు సంపాదిస్తుంది. మొదట్లో ఈ అమ్మాయి చాలా లావుగా ఉండేది. దీంతో బరువు తగ్గడానికి అనేక విధాలుగా ప్రయత్నించింది. 2015-16లో హోలీ బరువు తగ్గింది. ఇందుకోసం ఆమె చేసిన ప్రయత్నాలు వృథా కాలేదు. అయితే అప్పటివరకు తను ఉపయోగించిన బట్టలు లావు తగ్గిన తర్వాత వదులుగా మారిపోయాయి. దీంతో వాటిని దూరంగా పెట్టేది. ఆ తర్వాత తన బట్టలన్నింటిని అమ్మాలని నిర్ణయించుకుంది. బ్యాచిలర్ డిగ్రీ లా చదువుతున్న సమయంలో హోలీ ఈ పరిస్థితిని ఎదుర్కోంది. హోలీ అప్లికేషన్ ద్వారా తన పాత బట్టలను అమ్మడం మొదలు పెట్టింది. మొదట్లో ఇలా అమ్మడం వలన ఆమెకు పాకెట్ మనీకి సరిపోయేంత డబ్బు వచ్చింది. దీంతో ఆమె తన అవసరాలను తీర్చుకునేది. 2018 నాటికి హోలీ బ్రాండెడ్ బట్టలను అమ్మడం ప్రారంభించింది. ప్రస్తుతం హోలీ డిజైనర్ దుస్తులు.. అభరణాలను విక్రయిస్తుంది.

2021 నాటికి హోలీ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గతేడాది జూన్ నెలలో ఆమె పూర్తిగా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అందులో మగవారి బట్టలు కూడా అమ్మడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత సొంతంగా షాపులు తెరిచి సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతోంది. గతేడాది ఫిబ్రవరిలో వ్యాపారం నిమిత్తం దుబాయ్ వెళ్లిన హోలీ తిరిగి బ్రిటన్ వెళ్లలేదు. ప్రస్తుతం ఈమె ఇండొనేషియాలోని బాలిలో ఉంటుంది. అక్కడి నుంచే తన వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. ఓవైపు లాయర్ కావాలనుకుంటూనే … మరోవైపు తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకుంటుంది. అలాగే డీపాప్ యాప్ ద్వారా సెకండ్ హ్యాండ్ బట్టలు ఎలా కొనాలో వీడియోస్ తీసి షేర్ చేస్తుంది. ఆన్ లైన్ మాధ్యామల ద్వారా తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తుంది.

Also Read: Bigg Boss OTT: బిగ్‏బాస్ ఓటీటీ కంటెంస్టెంట్స్ వీళ్లే.. నెట్టింట్లో పైనల్ లిస్ట్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Rashmika Mandanna: లవ్ మ్యారేజ్ చేసుకోవడం పై నోరు విప్పిన నేషనల్ క్రష్.. అతడే నా భర్త అంటూ..

Horoscope Today: వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ.. చేసే పనులలో జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు రాశి ఫలాలు..

Mirnalini Ravi: ఎర్ర చీరలో వయ్యారాలు వలకబోస్తున్న ‘మృణాళిని రవి’ లేటెస్ట్ ఫొటోస్…