Viral News: గొర్రె కథ విని.. రూ.2 లక్షలకు విక్రయించిన రైతు.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా..? వీడియో..

Goat sold RS 1.91 Lakhs: దేశంలోని పలుచోట్ల నిత్యం వింతవింత సంఘటనలు జరుగుతుంటాయి. అవి తరచూ సోషల్ మీడియాలో వైరల్

Viral News: గొర్రె కథ విని.. రూ.2 లక్షలకు విక్రయించిన రైతు.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా..? వీడియో..
Viral News

Updated on: Nov 08, 2021 | 12:58 PM

Goat sold RS 1.91 Lakhs: దేశంలోని పలుచోట్ల నిత్యం వింతవింత సంఘటనలు జరుగుతుంటాయి. అవి తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ‘‘బిస్కెట్లతో బజ్జీలు వేయడం, వింతవింత ఆచారాలు పాటించడం, వింతగా ప్రవర్తించడం’’.. ఇలా ఎన్నో విషయాల గురించి మనం వింటూనే ఉంటాం. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. అది విన్న తర్వాత కచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. ప్రస్తుతం ఆ న్యూస్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వివరాల్లోకెళ్తే.. సాధారణంగా ఒక గొర్రె రూ.25 నుంచి 30 వేల మధ్య పలికితే గొప్ప. ఇంకా కొంచెం ఎక్కువ పలికినా మనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. కానీ ఒక గొర్రె ఏకంగా రూ.2లక్షల వరకు పలికింది. దాన్ని కొన్న వ్యక్తి ఊరేగింపుతో తన ఇంటికి తీసుకెళ్లాడు. ఈ వింత సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

కర్ణాటకలోని మళవళ్లి తాలూకా దేవీపుర గ్రామానికి చెందిన సణ్ణప్ప అనే వ్యక్తి ఈ గొర్రెను పెంచాడు. రెండేళ్ల క్రితం ఈ గొర్రెను రూ.1.5 లక్షలు ఖర్చు చేసి కొన్నాడు. దీంతో ఇప్పటివరకు మంచి ఆదాయం పొందాడు. అంతేకాకుండా గొర్రెల సంతానోత్పత్తికి ఇదే కీలకంగా మారింది. దీంతో రెండేళ్ల నుంచి మంచిగా ఆదాయాన్ని పొందుతూనే ఉన్నాడు. దీనికి నాలుగేళ్ల వయస్సు ఉంటుంది. అయితే.. ఈ గొర్రెకు మంచి ధర రావడంతో దానిని వేరేవ్యక్తికి అమ్మాడు. బీదరకోటె గ్రామరైతు కృష్ణగౌడకు ఈ గొర్రెను సణ్ణప్ప రూ.1.91 లక్షలకు అమ్మాడు.

అయితే.. కాసులు కురిపిస్తున్న గొర్రె గురించి తెలుసుకున్న తర్వాత.. కొనేందుకు కృష్ణగౌడ ఇష్టపడ్డాడు. చివరకు దానిని కొనుగులు చేసి.. పూలమాల వేసి పూజలు చేశాడు. అనంతరం దేవీపూర్ పరిసర గ్రామాల్లో ఊరేగిస్తూ దానిని ఇంటికి తీసుకెళ్లాడు.

Also Read:

Watch Video: కైలాసగిరి కాదు.. విషపు నగరి.. కాలుష్యపు నీటిలో పుణ్యస్నానాలు.. వీడియో వైరల్

Crime News: పంజాగుట్ట చిన్నారి హత్య కేసు.. బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్.. వెలుగులోకి సంచలన విషయాలు..