Video: అర్ధరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి.. కట్‌చేస్తే మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్.. ఈ వైరల్ వీడియో చూశారా?

Jaipur Viral Video: మానవత్వంతో చేసే సాయం ఒక్కోసారి ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో ఈ ఘటన నిరూపిస్తోంది. రోడ్డుపై అపరిచితులకు సాయం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా ఉండటమే శ్రేయస్కరం.

Video: అర్ధరాత్రి లిఫ్ట్ అడిగిన యువతి.. కట్‌చేస్తే మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్.. ఈ వైరల్ వీడియో చూశారా?
Jaipur Girl Steals Phone Viral Video

Updated on: Jun 05, 2026 | 10:08 AM

Jaipur Girl Steals Phone: రాత్రి వేళ రోడ్డు పక్కన ఒంటరిగా నిలబడి ఓ అమ్మాయి సాయం అడిగితే ఎవరైనా ఏం చేస్తారు? మానవత్వంతో బండి ఆపి లిఫ్ట్ ఇస్తారు. కానీ, ఈ వైరల్ వీడియో చూశాక ఎవరికైనా సాయం చేయాలంటేనే వణికిపోతారు. నమ్మకంతో లిఫ్ట్ ఇస్తే.. ఏకంగా ఫోన్ కొట్టేసి, ఎదురు తిరిగిన ఒక యువతి ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది.

జైపూర్‌లో షాకింగ్ ఘటన.. నట్టనడిరోడ్డుపై రచ్చ!

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరిగినట్లు చెబుతున్న ఒక సంచలన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. అర్ధరాత్రి వేళ ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా, ఒక యువతి సాయం కావాలంటూ లిఫ్ట్ అడిగింది. నడిరోడ్డుపై ఒంటరిగా ఉందని జాలిపడి ఆ యువకుడు ఆమెను తన వాహనంపై ఎక్కించుకున్నాడు. కానీ, కొద్దిసేపటికే ఆ యువతి అసలు రంగు బయటపడింది. సాయం చేసిన వ్యక్తి ఫోన్‌ను ఆమె అత్యంత చాకచక్యంగా దొంగిలించింది.

ఇవి కూడా చదవండి

Video: అర్ధరాత్రి 1 గంట.. నిర్మానుష్య రోడ్డుపై ఓ వ్యక్తి.. కట్‌చేస్తే.. ఆ తర్వాత సీన్ చూస్తే..!

యువకుడు తన ఫోన్ పోయిందని గమనించి, వెంటనే అప్రమత్తమై ఆమెను పట్టుకున్నాడు. దీంతో నడిరోడ్డుపై పెద్ద హైడ్రామా నడిచింది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఆ యువకుడు సదరు యువతి చేతిని గట్టిగా పట్టుకుని, “చూడండి, ఈమె నా దగ్గర లిఫ్ట్ అడిగి నా ఫోన్ దొంగిలించింది” అంటూ చుట్టుపక్కల వారికి చూపిస్తున్నాడు. మరో చేత్తో తన దొంగిలించబడిన ఫోన్‌ను పట్టుకుని కనిపిస్తున్నాడు. అయితే, సదరు యువతి మాత్రం తన ముఖాన్ని కెమెరాకు కనిపించకుండా దాచుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఎదురుదాడితోపాటు నిందలు!

తప్పుచేసి దొరికిపోయినా ఆ యువతిలో ఏమాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు సరే కదా.. పైగా ఆ యువకుడిపైనే ఎదురుదాడికి దిగింది. దొంగతనం బయటపడటంతో చుట్టుపక్కల జనాలు గుమిగూడారు. ఆ సమయంలో ఆమె సదరు యువకుడిని అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ గట్టిగా కేకలు వేస్తూ నిందలు వేయడం ప్రారంభించింది.

Video: అక్కా.. నీకో దండం.. ఛాన్స్ ఇస్తే ఎనుగునే ఎక్కించేట్టున్నావుగా.. ఈ వీడియో చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే..!

“ఇంత తప్పు చేసి కూడా నన్నే తిడుతోంది.. నాపైనే తప్పుడు ఆరోపణలు చేస్తోంది” అని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేయడం వీడియోలో వినబడుతోంది. కాసేపటి తర్వాత అక్కడి గందరగోళం మధ్య యువకుడు ఆమె చేతిని వదిలేయడంతో, ఆమె అక్కడి నుంచి చకచకా జారుకుంది. ఒకవేళ ఆ యువకుడి దగ్గర వీడియో సాక్ష్యం లేకపోయి ఉంటే, అక్కడ ఉన్న జనం ఆ అమ్మాయి మాటలు నమ్మి అతనిపై దాడి చేసేవారేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

సాయం చేయాలన్నా భయపడుతున్న జనం!

ఈ షాకింగ్ వీడియో సామాజిక మాధ్యమం ‘X’ (గతంలో ట్విట్టర్) వేదికగా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ తన చేదు అనుభవాన్ని పంచుకుంటూ.. “రోడ్డుపై ఎవరికైనా, ముఖ్యంగా మహిళలకు సాయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి నేను ఇలాగే సాయం చేయబోతే నాపైనే తప్పుడు కేసు పెట్టే ప్రయత్నం చేశారు” అని కామెంట్ చేశాడు. “ఇలాంటి వారి వల్లే నిజంగా ఆపదలో ఉన్నవారికి కూడా సమాజం సాయం చేయలేకపోతోంది” అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Video: రిసెఫ్షన్‌లో ఇదేక్కడి రచ్చ రా సామీ.. ఒక్కసారిగా దడుసుకుని చచ్చారుగా.. వధూవరుల రియాక్షన్ చూస్తే..

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us