Viral Video: వంటగదిలో వెరైటీ డ్యాన్స్‌.. అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే పడి పడి నవ్వాల్సిందే..

Funny Video: డ్యాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. మ్యూజిక్‌ వినపడితే మనలో చాలామంది కాళ్లు కదుపుతారు. అయితే డ్యా్న్సింగ్‌ ట్యాలెంట్‌ ఉన్నా అందరి ముందు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వెనకాడుతుంటారు.

Viral Video: వంటగదిలో వెరైటీ డ్యాన్స్‌.. అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తే పడి పడి నవ్వాల్సిందే..
Girl Dance

Updated on: Sep 22, 2022 | 10:50 AM

Funny Video: డ్యాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. మ్యూజిక్‌ వినపడితే మనలో చాలామంది కాళ్లు కదుపుతారు. అయితే డ్యా్న్సింగ్‌ ట్యాలెంట్‌ ఉన్నా అందరి ముందు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వెనకాడుతుంటారు. అలాంటి వారు బాత్రూమ్‌ లేదా వంటగదుల్లో ఉత్సాహంగా కాలు కదుపుతుంటారు. తద్వారా డ్యాన్స్‌పై తమ అభిరుచిని నెరవేర్చుకుంటారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఓ అమ్మాయి డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇందులో అమ్మాయి వంటగదిలో వినూత్నంగా డ్యాన్స్‌ చేసింది. దీనిని చూసిన నెటిజన్లు అమ్మాయి కిల్లర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందంటూ పడిపడి నవ్వుతున్నారు.

బాగా వైరల్ అవుతున్న వీడియోలో, అమ్మాయి వంటగదిలో నిలబడి ఉండడం మనం చూడవచ్చు. ఆ తర్వాత, ఈ అమ్మాయి ‘భాగ్ జానీ’ చిత్రంలోని సూపర్‌హిట్ సాంగ్‌ ‘మమ్మీ డాడీ’కు తనదైన శైలిలో డ్యాన్స్‌ చేస్తుంది. చేతులు, కాళ్లు వినూత్నంగా కదుపుతూ ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ నెటిజన్లకు నవ్వు తెప్పి్స్తోంది. ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్‌ చేయగా ఇప్పటివరకు లక్షలాది వ్యూస్‌ వచ్చాయి. అలాగే 55వేలకు పైగా లైకులు, వందలాది కామెంట్లు వచ్చాయి. మరి నెటిజన్లకు నవ్వు తెప్పిస్తోన్న ఈ ఫన్నీ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..