ఉపాధి కోసం పెంచుకున్న కోళ్లు మాయం.. చివరకు ఫామ్‌లో కనిపించిన భయానక దృశ్యం!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. రాత్రికి రాత్రే ఓ కోళ్ల ఫామ్‌లోకి చొరబడిన కొండచిలువ.. ఏకంగా పది కోళ్లను మింగేసింది. కడుపు నిండా కోళ్లను ఆరగించిన ఆ కొండచిలువ.. కదల్లేని స్థితిలో అదే ఫామ్‌లో ఉండిపోవడంతో తెల్లవారుజామున ఈ దృశ్యాన్ని చూసిన మహిళ ఒక్కసారిగా హడలిపోయింది.

ఉపాధి కోసం పెంచుకున్న కోళ్లు మాయం.. చివరకు ఫామ్‌లో కనిపించిన భయానక దృశ్యం!
Giant Python Attack

Edited By:

Updated on: Oct 31, 2026 | 10:00 AM

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. రాత్రికి రాత్రే ఓ కోళ్ల ఫామ్‌లోకి చొరబడిన కొండచిలువ.. ఏకంగా పది కోళ్లను మింగేసింది. కడుపు నిండా కోళ్లను ఆరగించిన ఆ కొండచిలువ.. కదల్లేని స్థితిలో అదే ఫామ్‌లో ఉండిపోవడంతో తెల్లవారుజామున ఈ దృశ్యాన్ని చూసిన మహిళ ఒక్కసారిగా హడలిపోయింది.

గ్రామానికి చెందిన సుల్వ రాజనర్సు అనే మహిళకు డ్వాక్రా సంఘం ద్వారా ఇందిరా మహిళా శక్తి పథకం కింద 25 కోడి పిల్లలు అందాయి. వాటిని పెంచుకుంటూ జీవనోపాధి పొందాలనే ఉద్దేశంతో ఇంటి వద్దే కోళ్ల ఫామ్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే రాత్రి సమయంలో ఆహారం కోసం వచ్చిన భారీ కొండచిలువ.. కోళ్ల ఫామ్‌లోకి చొరబడి కోళ్లపై దాడి చేసింది. అక్కడ ఉన్న కోళ్లలో దాదాపు పది కోళ్లను మింగేసింది.

అనంతరం భారీ శరీరంతో కదలలేని స్థితిలో ఫామ్‌లోనే ఉండిపోయింది. ఉదయం కోళ్ల ఫామ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన రాజనర్సుకు కొండచిలువ కనిపించడంతో భయంతో వణికిపోయారు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి చేరుకుని కొండచిలువను చూసేందుకు ఎగబడ్డారు. ఈ ఘటనపై బాధితురాలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

జీవనోపాధి కోసం పెంచుకుంటున్న కోళ్లను కొండచిలువ మింగేయడంతో బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం ద్వారా వచ్చిన కోళ్లతో ఉపాధి పొందాలనుకున్న మహిళకు.. కొండచిలువ రూపంలో అనుకోని నష్టం ఎదురైంది. ఈ ఘటనతో గోలేటి గ్రామంలో కొండచిలువ సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us