ప్రపంచానికి పెను ముప్పు.. అంతం తప్పదంటున్న శాస్త్రవేత్తలు.. మ్యాటర్ ఏంటంటే.?

|

Oct 19, 2021 | 5:48 PM

ఉత్తర ధృవం ఇప్పుడు భూమిని భయపెడుతోంది. గతేడాది మేలో ఆర్కిటిక్‌లోని అత్యంత పురాతన మంచు పలకలో ఓ భారీ గొయ్యి ఏర్పడింది...

ప్రపంచానికి పెను ముప్పు.. అంతం తప్పదంటున్న శాస్త్రవేత్తలు.. మ్యాటర్ ఏంటంటే.?
Antartic
Follow us on

ఉత్తర ధృవం ఇప్పుడు భూమిని భయపెడుతోంది. గతేడాది మేలో ఆర్కిటిక్‌లోని అత్యంత పురాతన మంచు పలకలో ఓ భారీ గొయ్యి ఏర్పడింది. ఇది ప్రపంచానికి ఆందోళన కలిగించే పరిణామమేనని సైంటిస్టులు అంటున్నారు. ఈ భారీ గొయ్యి కారణంగా ఆ మంచు పలక విరిగిపోయి, ఆ మంచు పూర్తిగా కరిగి సముద్రాల్లో కలుస్తుందని, దీనివల్ల నీటి మట్టాలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. పోలిన్యాగా పిలవబడే ఈ భారీ గొయ్య 1988, 2004లోనూ కనిపించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించి అధ్యయనాన్ని జియోఫిజికల్ రీసెర్చ్ లెటర్స్‌లోనూ ప్రచురించారు.

కెనడాకు సమీపంలోని మంచు పలకలో ఈ భారీ గొయ్యి ఏర్పడింది. ఇది 100 కి.మీ. మేర విస్తరించి ఉంది. ఉత్తర ధృవంలో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇక్కడి మంచు ప్రమాదంలో పడింది. ఈ శతాబ్దం చివరిలోగా ఇక్కడి చివరి మంచు పలక కూడా పూర్తిగా కరిగిపోయే ప్రమాదం ఉన్నదని, ఇది ఆర్కిటిక్‌, ఉత్తర ధృవాల్లో నివసిస్తున్న జీవరాశుల అంతానికి కారణమవుతుందని సైంటిస్టులు హెచ్చరించారు. గతేడాది మేలో వచ్చిన ఓ భారీ తుఫాను కారణంగా ఈ గొయ్యి ఏర్పడినట్లు వాళ్లు చెప్పారు. ఈ గొయ్యికి సంబంధించిన ఫొటోలను శాటిలైట్ ద్వారా తీశారు.