Viral: క్షణిక సంతృప్తి కోసం ప్రైవేట్ పార్టులోకి.. ఆపై ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా డాక్టర్లు షాక్

నిత్యం డాక్టర్లు సవాళ్లను ఎదుర్కుంటూ ఉంటారు. చిత్రవిచిత్రమైన కేసులను సాల్వ్ చేస్తుంటారు. మరి అలాంటి ఓ ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్ల మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరి ఆ వార్త ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. మీరే చూసేయండి.

Viral: క్షణిక సంతృప్తి కోసం ప్రైవేట్ పార్టులోకి.. ఆపై ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా డాక్టర్లు షాక్
Doctors

Updated on: Apr 29, 2025 | 6:53 PM

మనందరిలోనూ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఒకరు హార్మోన్స్ కంట్రోల్ చేసుకునేవారైతే.. మరొకరు హార్మోన్స్ కంట్రోల్ చేసుకోలేని బ్యాచ్‌కు చెందుతారు. ఇలా హార్మోన్స్ కంట్రోల్ చేసుకోలేని బ్యాచ్.. చేయకూడదని, చెప్పలేనటువంటి పనులు చేస్తుంటారు. ఇలా తమను తామే చిక్కుల్లో పడేసుకుంటారు. స్వీయ సంతృప్తి కోసం తమ శరీరంతో వాళ్లు చేసే ప్రయోగాలు వింటేనే అసహ్యంగా ఉంటాయి. ఇలాంటి సంఘటనలు మన దేశంలో కంటే.. విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక అక్కడి డాక్టర్లు ఈ చిత్రవిచిత్రమైన కేసులను తమ మెడికల్ జర్నల్‌లో పొందుపరుస్తారు. అలాంటి ఓ కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

వివరాల్లోకి వెళ్తే.. ఎలాంటి మెడికల్ రికార్డులు లేని ఓ 12 ఏళ్ల బాలుడు తన మలద్వారంలో లిప్ బామ్ జోప్పించుకున్నాడు. పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి, అలాగే మలవిసర్జన చేయడంలో ఇబ్బంది పడటంతో.. అతడి కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. శరీరంలోకి ఫారిన్ అబ్జెక్ట్ చొప్పించుకోవడం వెనుక అసలు ఉద్దేశ్యం లైంగిక ఆసక్తిని అని తేల్చారు వైద్యులు.

ఆసుపత్రిలో చేరే సమయానికి సదరు బాధితుడు నార్మల్‌గానే ఉన్నాడు. అతని రక్తపోటు 118/78, పల్స్ రేటు 60/నిమిషం, శరీర ఉష్ణోగ్రత 36.4 °Cగా ఉంది. ఇంటర్నల్ గాయాలు లాంటివి ఏం లేవు. అలాగే ఎలాంటి ఆకస్మిక నొప్పులు కూడా కలగలేదు. ఇక డాక్టర్లు CT స్కాన్‌ చేయగా.. ఎగువ పురషనాళం వద్ద ఏదో అబ్జెక్ట్ ఉన్నట్టు గుర్తించారు. ఇక ఎండోస్కోపీ ద్వారా డాక్టర్లు ఆ పరికరాన్ని అతడి శరీరంలో నుంచి తొలగించారు. కాగా, టీనేజర్ల అంశంలో తల్లిదండ్రులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని.. స్కూల్ వయస్సులో లైంగిక వేధింపులు, Bullying లాంటివి స్కూల్స్‌లో జరుగుతుంటాయని.. అందుకే పిల్లలకు ఎప్పటికప్పుడు ఫిజికల్ చెకప్‌లు చాలా ముఖ్యమని డాక్టర్లు పేర్కొన్నారు.