Viral: పడవలో వేటకు వెళ్లిన జాలర్లకు నీటిపై తేలుతూ కనిపించిన వస్తువు.. దగ్గరికి వెళ్లి చూడగా షాక్

|

Sep 05, 2022 | 5:01 PM

పడవలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సముద్రంలో దూరం నుంచి ఏదో వస్తువు తేలుతూ కనిపించింది. దీంతో వెంటనే ఆ వస్తువు సమీపానికి వెళ్లి చూసి కంగుతిన్నారు.

Viral: పడవలో వేటకు వెళ్లిన జాలర్లకు నీటిపై తేలుతూ కనిపించిన వస్తువు.. దగ్గరికి వెళ్లి చూడగా షాక్
Viral News
Follow us on

Trending News: అతను చేపల వేటకు వెళ్లి ప్రాణాపాయంలో చిక్కుకున్నాడు. సముద్రంలోకి వెళ్లిన కొంత సమయం టైమ్ తర్వాత పడవ మునగడం స్టార్టయ్యింది. కానీ అతడికి విధి సహకరించింది. ఎట్టకేలకు 11 రోజులు పాటు పోరాడి  మృత్యుంజయుడిగా బయటకు వచ్చాడువివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌(Brazil)లో నివాసముండే రోములాడో మసిడో రోడ్రోగస్‌ తన పడవలో చేపలు పట్టేందుకు ఆగస్టులో సముద్రంలోకి వెళ్లాడు. కానీ అతడి ఫేట్ అస్సలు బాలేదు. అదేంటి చేపలు పడలేదా అనుకోకండి. చేపలు సంగతి పక్కన పెడితే ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అతను ప్రయాణిస్తున్న పడవ మునగడం ప్రారంభమైంది. ఇక లైఫ్ ఖతమే అనుకున్నాడు. కానీ ఊహించని విధంగా అతని పడవలోని ఫ్రీజర్ వాటర్‌పై తేలుతూ కనిపించింది. ఇక మరో సెకను ఆలస్యం లేకుండా దానిపైకి దూకాడు. అది ఒక సైడ్ ఒరిగినప్పటికీ.. అతడి బరువును కాసింది. ఆ ఫ్రీజర్ అలా తేలుతూనే ముందుకు సాగింది. అన్నపానియాలు లేవు. ఆదమరిస్తే ఏం జరుగుతుందో తెలీదు. కొన్ని పరిస్థితుల్లో ఫ్రీజర్‌లోకి వాటర్ రావడంతో.. వాటిని తన చేతులతోనే ఎత్తిపోశాడు. తిమింగళాలు, షార్క్ చేపలు కొన్నిసార్లు అతడిని సమిపించేవి కూడా. అలా దాదాపు 11 రోజులు ఫ్రీజర్‌లోనే గడిపాడు.

చివరకు ఓ చేపల పడవ ఆ ఫ్రీజర్ సమీపంలోకి వచ్చింది. దూరంగా ఉన్నప్పుడు అదేదో వస్తువు అనుకున్నారు. లోపలి నుంచి రోడ్రిగో చేతులు ఊపడంతో.. అందులో మనిషి ఉన్నట్లు అవతలి వాళ్లు గుర్తించారు. ఎట్టకేలకు దక్షిణ అమెరికా దేశం తీరం.. సురినామ్‌లో అతడిని సేవ్ చేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ 11 రోజుల్లో అతను 5 కేజీల వెయిల్ లాస్ అయ్యాడు.  కాగా డాక్యుమెంట్స్ లేకపోవడంతో.. అతడిని 2 వారాలు కస్డీలోకి తీసుకుని.. వివరాలు సేకరించి వదిలిపెట్టారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..