Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!

Viral Video Update: సోషల్‌ మీడియా వీడియోల్లో కాస్త వెరైటీగా ఉన్నవి ఎక్కువ మందికి నచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో అలాంటిదేనండీ...

Viral Video: ద్యావుడా.. బైక్‌పై ఇలా కూడా వెళ్తారా.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..!
Viral Pic

Updated on: May 10, 2021 | 3:36 PM

Viral Video Update: సోషల్‌ మీడియా వీడియోల్లో కాస్త వెరైటీగా ఉన్నవి ఎక్కువ మందికి నచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో అలాంటిదేనండీ. చూసిన వాళ్లు మొదట ఆశ్చర్యపోతున్నారు తర్వాత నవ్వేస్తున్నారు. ఓ బైక్‌పై నలుగురు వెళ్తున్నారు. అదే చిత్రం అనుకుంటే ఆ నలుగురిలో ముందు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి కాకుండా మిగతా వెనక కూర్చున్న ముగ్గురూ మరో వ్యక్తిని తమ చేతులతో పట్టుకొని మోసుకెళ్తున్నారు.

అతను వాళ్ల తొడలపై పడుకుని ఉన్నాడు. వాళ్లు ఆయన్ని ఏమాత్రం పట్టు జారకుండా పట్టుకున్నారు. దాంతో అతను సూపర్ మేన్‌లా గాల్లో తేలినట్లుగా దూసుకుపోతున్నాడు. అతన్ని కూర్చోబెట్టేందుకు బైక్‌పై ప్లేస్ లేకపోవడంతో ఇలా ఎరేంజ్ చేసుకున్నారు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు గానీ దేవరాజ్సింహ్ చౌహాన్ అనే నెటిజన్ ఈ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఇలాంటిదే మరో ఫన్నీ పిక్ మరోటి. ఓ మహిళ మాస్కుతోపాటూ… ముక్కుపుడక నగను కూడా మాస్క్ పై ధరించింది. పెళ్ళి మేకప్‌లో భాగంగా ఇలా చేసింది. ఈ పిక్‌ వైరల్ అవ్వడంతో ఇండియాలో ఇలాంటివి కూడా జరుగుతాయి అనే అర్థం వచ్చేలా నెటిజన్స్ ఫన్నీ కామెంట్లు పోస్ట్‌ చేస్తున్నారు.

Also Read:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!