Viral Photo: మీరు ఈ పజిల్ సాల్వ్ చేస్తే.. మీకంటే తోపు ఎవ్వరూ లేరు.. ట్రై చేయండి!

సాధారణంగా పజిల్స్ ఇష్టం లేనివారు ఎవ్వరూ ఉండరు. తమ మేధాశక్తితో పాటు చురుకుదనాన్ని పెంపొందించేందుకు అందరూ పజిల్స్‌ను ఓ పట్టు పడతారు...

Viral Photo: మీరు ఈ పజిల్ సాల్వ్ చేస్తే.. మీకంటే తోపు ఎవ్వరూ లేరు.. ట్రై చేయండి!
Curved Line

Updated on: Dec 13, 2021 | 5:30 PM

సోషల్ మీడియాలో మనల్ని మభ్యపెట్టే చిత్ర విచిత్రమైన ఫోటోలు తరుచూ వైరల్ అవుతుంటాయి. అది ఫోటోగ్రాఫర్ మాయో.. లేక ఫోటోషాప్ మేజికో తెలియదు గానీ.. ఎన్నో రకాల ఫోటోలు మనల్ని ప్రతీసారి ఆశ్చర్యపరుస్తుంటాయి. అందులో ఒకటి ఫోటో పజిల్స్. వీటికి నెటిజన్లు బాగా ఆకర్షితులవుతారు. సాధారణంగా పజిల్స్ ఇష్టం లేనివారు ఎవ్వరూ ఉండరు. తమ మేధాశక్తితో పాటు చురుకుదనాన్ని పెంపొందించేందుకు అందరూ పజిల్స్‌ను ఓ పట్టు పడతారు.

తగ్గేదే..లే అంటూ సదరు పజిల్‌ను సాల్వ్ చేసేదాకా వదిలిపెట్టరు. వీకెండ్ బుక్స్, మ్యాగజైన్లలో వచ్చే పజిల్స్ ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. ఫోటో పజిల్స్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటాయి. వాటిని సాల్వ్ చేసేందుకు వీక్షకులు అమితమైన ఆసక్తిని కనబరుస్తారు. ఈ ఫోటో పజిల్స్ కోసం ప్రత్యేకంగా కొంతమంది సోషల్ మీడియాలో పేజీలు రన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ Curve Line ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. ఈ పజిల్‌ను సాల్వ్ చేయడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు. ఈ చిత్రంలో కర్వ్ లైన్(Curve Line)ను క్షణాల్లో కనిపెట్టారంటే మీకంటే తోపులు ఎవ్వరూ లేరని చెప్పాలి. మీ కళ్లకు పదును.. మెదడుకు మేత వేయాలంటే ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి. ఒక్కసారి ట్రై చేయండి.

Also Read: సముద్రంలో చేపల కోసం వేటకు వెళ్తే.. జాలర్లకు ఊహించని షాక్.. ఎదురుగా.!

Loading...
Unable to load recommendations.
Follow Us