Viral Photo: ఈ ఫోటోలో మొసలి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. చాలా ఈజీగా కనిపెట్టొచ్చు.!

Spot The Photo Puzzle: సోషల్ మీడియాలో తరచుగా భ్రమపరిచే ఫోటోలు, పజిల్స్, స్పాట్ ది యానిమల్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి...

Viral Photo: ఈ ఫోటోలో మొసలి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. చాలా ఈజీగా కనిపెట్టొచ్చు.!
Crocodile

Updated on: Dec 10, 2021 | 11:53 AM

సోషల్ మీడియాలో తరచుగా భ్రమపరిచే ఫోటోలు, పజిల్స్, స్పాట్ ది యానిమల్ ఫోటోలు వైరల్ అవుతుంటాయి. వీటిపై నెటిజన్లు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. ఇవి వాళ్ల మెదడుకు పని చెప్పడమే కాకుండా ఆలోచింపజేస్తాయి. ఇలాంటి ఎన్నో ఫోటో పజిల్స్ తరచూ నెటిజన్లను గందరగోళం చేస్తుంటాయి. కొంతమంది వీటిని సాల్వ్ చేయకుండా వదిలిపెట్టరు. ఒక్క నిమిషం పాటు చూసి.. అందులో ఏదీ లేదని అనుకుంటే పొరపాటే. సమాధానం కోసం లోతుగా వెతక్క తప్పదు. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.

పైన పేర్కొన్న ఫోటోలో ఓ మొసలి దాగుంది. దాన్ని మీరూ కనిపెట్టాలి. చూడటానికి అదొక సరస్సులా కనిపించవచ్చు. అందులో ‘సముద్ర అలెగ్జాండర్’ ఇంచక్కా సేద తీరుతోంది. కొంచెం తీక్షణంగా చూస్తే ఈ పజిల్‌ను మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ ఫోటో పజిల్‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా.. ఇప్పటిదాకా దీనికి 2.1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ఈ పజిల్‌ను ట్రై చేయండి.. సమాధానం దొరక్కపోతే క్రింద వీడియోను చూడండి.

Also Read: సోఫాలో నుంచి వింత శబ్దాలు.. భయం భయంగా పోలీసులకు ఫోన్ చేసిన వ్యక్తి.. చివరికి ఏం జరిగిందంటే!