Viral News: బిడ్డ కోసం పక్షి ఆరాటం.. కాకులతో భీకర పోరాటం.. వైరల్ అవుతున్న వీడియో.!

Crow Viral Video: ఈ ప్రపంచంలో తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. తల్లి ప్రేమ మాటల్లో వ్యక్తపరచలేనిది. తన బిడ్డలకు చిన్న దెబ్బ తగిలినా..

Viral News: బిడ్డ కోసం పక్షి ఆరాటం.. కాకులతో భీకర పోరాటం.. వైరల్ అవుతున్న వీడియో.!
Crow Fight

Updated on: May 06, 2021 | 3:56 PM

Crow Viral Video: ఈ ప్రపంచంలో తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. తల్లి ప్రేమ మాటల్లో వ్యక్తపరచలేనిది. తన బిడ్డలకు చిన్న దెబ్బ తగిలినా.. ఆ తల్లి గుండె విలవిల్లాడిపోతుంది. పిల్లలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా.. అమ్మ మనసు సహించదు. తన గురించి పట్టించుకోకుండా.. వాటి నుంచి తన బిడ్డలను బయటపడేసే దాకా పోరాడుతూనే ఉంటుంది. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరి ఫిదా అవుతున్నారు.

ఇందులో ఓ తల్లి తన బిడ్డను రక్షించుకునేందుకు ఎంతటి పోరాటం చేసిందో మనం చూడవచ్చు. ఓ కాకి పక్షి గూడను నాశనం చేసి.. అందులో ఉన్న పక్షిపిల్లను తన పంజాతో పట్టుకుంటుంది. అక్కడికి చేరుకున్న ఆ పక్షి పిల్ల తల్లి.. తన బిడ్డ కోసం ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాకితో యుద్దానికి దిగుతుంది.

రెండింటి మధ్య భారీ పోరాటం జరుగుతుండగా.. అక్కడే ఉన్న మరో కాకి పక్షి పిల్లపై దాడి చేసేందుకు యత్నిస్తుంది. అయితే ఆ తల్లి పక్షి దానిని కూడా బిడ్డ నుంచి దూరంగా తరిమేస్తుంది. ఏది ఏమైనా చివరికి ఆ పక్షి తన బిడ్డను రెండు కాకుల నుంచి సురక్షితంగా రక్షించుకుంటుంది. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిడ్డ కోసం తల్లి పక్షి చేసిన పోరాటానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇవి చదవండి:

ఏపీ ప్రజలకు ముఖ్య అలెర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ లో మార్పులు.. వివరాలివే..

Viral News: గగుర్పొడిచే దృశ్యం.. ఒకే చోట కుప్పలు తెప్పలుగా చేరిన పాములు.. వీడియో వైరల్.!

ఈ ఫోటోలో ఎరను వేటాడేందుకు చిరుతపులి నక్కింది.. అది ఎక్కడ ఉందో కనిపెట్టగలరా.?