Viral Video: ఒక్కసారిగా ఎదురుపడిన దెయ్యం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి..

చాలా మెదడును తొలిచే ప్రశ్నల్లో దెయ్యం ఉందా.? లేదా.? అన్నది ఒకటి. కొంతమంది దెయ్యలు ఉన్నాయని.. మరికొంతమంది లేవు అని నిత్యం వాదించుకుంటూనే ఉంటారు.

Viral Video: ఒక్కసారిగా ఎదురుపడిన దెయ్యం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి..
Ghost

Updated on: Aug 01, 2022 | 6:53 PM

Viral Video: చాలా మెదడును తొలిచే ప్రశ్నల్లో దెయ్యం ఉందా.? లేదా.? అన్నది ఒకటి. కొంతమంది దెయ్యలు ఉన్నాయని.. మరికొంతమంది లేవు అని నిత్యం వాదించుకుంటూనే ఉంటారు. మరి కొంతమంది ఒక అడుగు ముందుకేసి మేము చూశామని కూడా చెపుతూ ఉంటారు. అయితే దెయ్యం పేరు చెప్పుకొని చాలా  మంది డబ్బులు రాబట్టే వ్యాపారాలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక దెయ్యాల నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు కూడా మంచి క్రేజ్ కూడా ఉంది. అయితే దెయ్యాలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉంటాయి.. లేని దెయ్యాలను గ్యాఫిక్స్ లో పెట్టిమరీ వీడియోల్లో చూపిస్తూ ఉంటారు. అలాంటి వీడియోలకు సోషల్ మీడియాలో యమా క్రేజ్ ఉంది. అలాగే ఇంకొంతమంది దెయ్యాల గెటప్ వేసుకొని భయపెడుతూ ఉంటారు.. తాజాగా ఆలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇద్దరు యువకులు నడుచుకుంటూ వెళ్తుండగా  ఓ దెయ్యం ఎదురయ్యింది. ఆ అబ్బాయిల  అకస్మాత్తుగా దెయ్యం చూడటంతో… ఆ దెయ్యాన్ని చూసిన ఓ కుర్రాడు వెంటనే భయంతో కిందపడి మరి పారిపోవడం మీరు చూడవచ్చు. ఇంకొక యువకుడు కొంచం సేపు ఆశ్చర్యపోయాడు, కానీ ఆ తర్వాత ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. వెంటనే ఆ దెయ్యానికి ఓ ఫ్లైంగ్ కిస్ ఇచ్చాడు. దెబ్బకు ఆ దెయ్యం  మూర్ఛపోయి పడిపోయింది. ఏది ఏమైనా ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజం కాదని ఈ వీడియో చూసిన వెంటనే తెలిసిపోతుంది. ఇది నిజంగా వినోదం కోసం రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో ఇన్ఖాస్టా బటర్‌ఫ్లై__మహి ద్వారా షేర్ చేయబడింది. ఈ వీడియో చూస్తున్న వారు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఈవీడియో పై మీరూ ఓ లుక్కేయండి..

ఇవి కూడా చదవండి

(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఇవ్వబడింది. దెయ్యాలున్నాయన్న ప్రచారాన్ని TV9 తెలుగు ధృవీకరించదు. అలాగే దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించలరు)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి