
తన వద్ద శిక్ష అనుభవించిన ఖైదీనే ఓ జైలర్ పెళ్లి చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ధర్మేంద్ర అనే వ్యక్తికి కోర్టు 2007లో జీవితఖైదు శిక్ష విధించింది. దీంతో పోలీసులు అతన్ని మధ్య ప్రదేశ్‌లోని మధ్యప్రదేశ్‌లోని సత్నా సెంట్రల్ జైల్‌కు తరలించారు. అయితే ఫిరోజా ఖాతూన్ అనే మహిళ పోలీసు అక్కడ సహాయ జైలు అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలోనే ధర్మంద్రకు డిప్యూటీ జైలర్ ఫిరోజాతో పరిచయం ఏర్పడింది. అయితే శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ధర్మేంద్ర ప్రవర్తనలో మార్పు రావడంతో అతనిపై ఫిరోజాకు మంచి అభ్రిపాయం ఏర్పడింది.కాలక్రమేనా అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ ఒకరికొకరు మనసిచ్చుకన్నారు. కలిసి జీవితం పంచుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం పిరోజా ధర్మేంద్ర జైలు నుంచి విడుదల అయ్యేంత వరకు వేచి చూసింది.
ఇక సత్ప్రవర్తన పేరుతో 2020లో ధర్మేంద్ర జైలు నుంచి విడుదల అయ్యాడు. దీంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇద్దరి మతాలు వేరు కావడంతో ఫిరోజా కుటుంబ సభ్యులు ఈ వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సొంత సమాజంలో పెళ్లి చేయాలని పేరెంట్స్ పట్టుబట్టినప్పటికీ.. పిరోజా మాత్రం తన నిర్ణయానికే కట్టుబడ్డారు. ఇది నా వ్యక్తిగత నిర్ణయం.. మా పెళ్లి పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ప్రతి వ్యక్తికి తమ వ్యక్తిగత జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుందని ఆమె పేరెంట్స్‌తో తేల్చి చెప్పింది.
దీంతో ఫిరోజా కుటుంబ సభ్యులు లేకుండానే తోటి పోలీసుల అధికారులు, విహెచ్‌పీ నేతల ఆధ్వర్యంలో ఛతర్‌పూర్ జిల్లాలోని లవ్‌కుష్ నగర్‌లో ధర్మేంద్ర, ఫిరోజాల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ముస్లిం మతానికి చెందిన ఫిరోజాను ధర్మేంద్ర హిందూ సంప్రదాయంలో వేద మంత్రాల సాక్షిగా పెళ్లి చేసుకోవడంతో వీరి వివాహం మతసామరస్యానికి, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనంగా నిలిచింది. తన వద్ద శిక్ష అనుభవించిన ఖైదీనే ఆ జైలర్ భర్తగా చేసుకోవడంతో వీరు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.