రేయ్‌ ఏంట్రా ఇదీ.. మ్యాగీ కోసం అంత పని చేశావెంట్రా బుడ్డోడా! కొన్నోడి మంచితనంతో..

కాన్పూర్‌లో 13 ఏళ్ల బాలుడు మ్యాగీ నూడుల్స్ కొనడానికి తన సోదరి నిశ్చితార్థపు ఉంగరాన్ని అమ్మేందుకు ప్రయత్నించాడు. దుకాణదారుడి నిజాయితీ వల్ల ఉంగరం తిరిగి తల్లికి చేరింది. ఈ సంఘటన పిల్లల్లో ఫాస్ట్ ఫుడ్ వ్యసనం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తుంది.

రేయ్‌ ఏంట్రా ఇదీ.. మ్యాగీ కోసం అంత పని చేశావెంట్రా బుడ్డోడా! కొన్నోడి మంచితనంతో..
Engagement Ring Maggi

Updated on: Oct 06, 2025 | 10:42 AM

కాన్పూర్‌లోని శాస్త్రి నగర్‌లో జరిగిన ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలుడు తన సోదరి నిశ్చితార్థ ఉంగరాన్ని అమ్మేశాడు. అది కూడా ఏదో పెద్ద ఆపద వచ్చి అమ్మేశాడేమో అనుకునేరు.. జస్ట్‌ మ్యాగీ నూడుల్స్ కొనడానికి ఉంగరంతో ఒక ఆభరణాల దుకాణానికి వెళ్ళాడు. ఈ సంఘటన పిల్లలకు నూడుల్స్, ఫాస్ట్ ఫుడ్‌కి ఎంత అడిక్ట్‌ అవుతున్నారో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. ఆభరణాల దుకాణ యజమాని ఆ కుర్రాడి తల్లికి ఫోన్‌ చేయడంతో చివరికి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ఓ బాలుడు ఒక ఆభరణాల దుకాణంలోకి వెళ్లి తన దగ్గర బంగారపు ఉంగరం ఉంది కొంటారని అని అడిగాడు. దుకాణ యజమాని పుష్పేంద్ర జైస్వాల్ ఆ బాలుడి అమాయకత్వాన్ని గమనించి.. ఈ ఉంగరం ఎందుకు అమ్ముతున్నావ్‌ అని అడిగ కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ బాలుడు నిజాయితీగా మ్యాగీ కొనడానికి డబ్బు కావాలని ఆ ఉంగరాన్ని తెచ్చానని సమాధానం ఇచ్చాడు.

ఏదో తప్పు జరిగిందని గ్రహించిన ఆ నగల వ్యాపారి వెంటనే ఆ అబ్బాయి తల్లిని దుకాణానికి పిలిచి ఆ ఉంగరాన్ని చూపించాడు. ఆ తల్లి షాక్ అయి, అది తన కూతురి నిశ్చితార్థ ఉంగరమని నిర్ధారించుకుంది. తన పెళ్లి కొద్ది రోజుల్లోనే జరుగుతుందని ఆమె చెప్పింది. తన మార్కెట్‌లోని ఏ దుకాణదారుడు కూడా సరైన ధృవీకరణ లేకుండా మైనర్లు తెచ్చిన వస్తువులను కొనుగోలు చేయదని పుష్పేంద్ర జైస్వాల్ అన్నారు. ఆ బిడ్డ అమాయకత్వాన్ని చూసి చలించిపోయి, అతను ఆ ఉంగరాన్ని తల్లికి తిరిగి ఇచ్చాడు. ఆమె తన కొడుకుతో దుకాణం నుండి బయటకు వెళ్ళినప్పుడు, ఆమె కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి