Viral Video: మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు! వీడియో వైరల్

మెట్రో స్టేషన్‌లో ఒక జంట ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో కుటుంబ సభ్యుల భావోధ్వేగాలేకాదు గంటల తరబడి ఎదురు చూడటంలో ఉన్న విసుగు, విరక్తత కూడా కళ్లకు కట్టినట్లు ఈ వీడియో చూపించింది. అసలేం జరిగిందంటే..

Viral Video: మెట్రో స్టేషన్‌లో జంట ఎంగేజ్‌మెంట్‌.. గుక్కపట్టి ఏడ్చిన వరుడు! వీడియో వైరల్
Roka And Ring Ceremony At Mumbai Metro Station

Updated on: Feb 07, 2026 | 8:15 PM

ఈ వీడియో ఓ యువకుడు, అతడి తల్లిదండ్రులు వధువు రాక కోసం మెట్రో స్టేషన్‌లో దాదాపు 2 గంటల వరకు వేచి ఉండటంతో ప్రారంభమవుతుంది. నిమిషాలు గంటలుగా మారి ఎదురు చూసిన ఆమె ఎంతకూ మెట్రో స్టేషన్‌కు చేరుకోలేదు. దీంతో వరుడి తల్లి చికాకుతో మాట్లాడటం వీడియోలో చూడొచ్చు. దీంతో వరుడు తన భాగస్వామితో ఫోన్‌లో మాట్లాడుతూ ఆమెకు భరోసా ఇస్తూ, ఆమెను ఇంట్లోనే ఉండమని ఒప్పించేందుకు నానాయాతన పడటం వీడియోలో కనిపిస్తుంది. అయితే చివరకు వధువు స్టేషన్‌కు చేరుకోవడంతో అత్త ఆమెకు ఎదురెళ్లి తన కుటుంబం దాదాపు రెండు గంటలుగా స్టేషన్‌లో వేచి ఉందని ఎత్తి చూపింది. ఈ మొత్తం సంభాషణలో ఆమె ఉద్రిక్తత, అసహనం, భావోద్వేగ అంతా నిజాయితీని ప్రతిబింబిస్తుంది.

అయితే అంతలోనే ఆమె షాకింగ్‌ నిర్ణయం తీసుకుంటుంది. మెట్రో స్టేషన్‌లోనే రోకా జరుగుతుందని ప్రకటించింది. వరుడు ఎంత వారించినా ఆమె వెనక్కి తగ్గకుండా ఎంగేజ్‌మెంట్ ఇక్కడే జరుగుతుందని అక్కడే ఉన్న ఓ బెంచ్‌పై వరుడు, వధువును కూర్చోబెడుతుంది. వరుడి స్నేహితుడికి వేడుకను సరిగ్గా రికార్డ్ చేయమని ఆదేశిస్తుంది. ఆ వీడియోను రుజువుగా వధువు తండ్రికి పంపాలని పట్టుబడుతోంది. ఆ వెంటనే వేగంగా ఎంగేజ్‌మెంట్‌ వేడుక జరిపిస్తుంది. దీంతో వారికి అధికారికంగా నిశ్చితార్థం జరిగినట్లు అయింది. ఈ ఊహించని పరిణామానికి వరుడు పబ్లిక్ ప్లేస్ లోనే గుక్కపట్టి ఏడ్చేయడం వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను వరుడి స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. కొంతమంది యూజర్లు వరుడి తల్లి చేసిన పనిని సమర్ధిస్తే.. మరికొందరేమో దీనిని విమర్శిస్తున్నారు. ఈ ప్రశాంతమైన క్షణం జీవితంలోని చిన్న ఆనందాలను జరుపుకోవడానికి ఆహ్వానం అని ఓ యుజర్‌ వధువరులకు కామెంట్ సెక్షన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి క్షణాలు మనకు సాధారణ ఆనందాలను ఆపి అభినందించమని గుర్తు చేస్తాయి అని మరొకరు, ఈ తరంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో జరగాల్సిందేనా? అని ఇంకొకరు తమదైన శైలిలో స్పందించారు. మెట్రో స్టేషన్ ఎంగేజ్‌మెంట్ వీడియోతో పబ్లిక్ డిజిటల్ ప్రదేశంలో వ్యక్తిగత మైలురాళ్ళు ఎలా పెరుగుతున్నాయో మరొక ఉదాహరణగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.