Viral Video: “నేను యాచకుడిని కాదు.. సంగీతంతో మీ ఆత్మను తాకాలని కోరుకుంటున్నా”..

|

Oct 11, 2021 | 6:19 PM

ప్రతిభ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలంటారు. ఇలా ప్రతిభ ఉండి అదృష్టం లేక ఓ కాళాకారుడు యాచకుడయ్యాడు. ఆ కథ ఏమిటో చూద్దాం...

Viral Video: నేను యాచకుడిని కాదు.. సంగీతంతో మీ ఆత్మను తాకాలని కోరుకుంటున్నా..
Flute
Follow us on

ప్రతిభ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలంటారు. ఇలా ప్రతిభ ఉండి అదృష్టం లేక ఓ కాళాకారుడు యాచకుడయ్యాడు. ఆ కథ ఏమిటో చూద్దాం. సామాజిక మాద్యమాల్లో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు కొన్ని వీడియోలు హృదయాన్ని ఆకర్షిస్తాయి. మరి కొన్ని వీడియోలు హృదయానికి తాకేలా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలైంది. నెంబరు అనేది వయస్సుకు మాత్రమే ప్రతిభకు కాదని ఓ వృద్ధుడు ఈ వీడియోలో నిరూపించాడు. ఢిల్లీ రాజధాని వీధుల్లో వృద్ధుడు వేణువుతో మధురమైన రాగాన్ని పలుకుతున్నాడు. అతడి ప్రతిభను చూసి పౌరులు ఆశ్చర్యపోతున్నారు.

కానీ ఇంత ప్రతిభ ఉన్నా అతడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం రోడ్డుపై కూర్చోని వేణువు వాయిస్తున్నాడు. వాస్తవానికి విదేశాల్లో ప్రజలు భిక్షాటనకు చేతులు చాచడానికి బదులుగా బహిరంగ ప్రదేశంలో సంగీతం ప్లే చేసి డబ్బు సంపాదిస్తారు. ఢిల్లీకి చెందిన వృద్ధుడు అలానే చేస్తున్నాడు. అతడిని అందరు యాచకుడు అనుకుంటున్నారు. కానీ అతని వద్ద చిన్న బోర్డు ఉంది. అందులో “I Am Not Beggar” అని రాసి ఉంది. తద్వారా అతడిని ఎవరూ బిచ్చగాడుగా పరిగణించలేరు. ఈ వీడియోను ఢిల్లీకి చెందిన ఇన్‌స్టాగ్రామ్ యూజర్ హిమాన్షి కుక్రేజా తన ఖాతాలో పంచుకున్నారు. “నేను భిక్షాగాడిని కాదు” అని అతని వద్ద బోర్డు ఉన్నప్పటికీ అతడికి తన బోర్డు కింద ఉన్న బట్టలో కొన్ని రూపాయలు వేస్తున్నారు. ఈ వీడియో ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో చిత్రీకరించబడింది. నేను భిక్షాగాడిని కాదు అని రాసి ఉన్న బోర్డు ‘నేను సంగీతం సహాయంతో మీ ఆత్మను తాకాలని కోరుకుంటున్నాను’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఈ వీడియోపై ప్రజలు వేగంగా స్పందిస్తున్నారు.

 

Read Also..Hetero: డబ్బులు బాబోయ్‌ డబ్బులు.. నోట్ల కట్టలను దాచడానికే అపార్ట్‌మెంట్‌లు కొన్నారు. హెటిరో ఐటీ సోదాల్లో..