Viral: ఇంటికి మరమ్మతులు చేస్తుండగా బయటపడిన చిత్తు పేపర్లు.. పరిశీలించి చూస్తే జిగేల్‌మన్న కళ్లు..

|

Sep 12, 2022 | 6:14 AM

Viral News: ‘దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది. అదృష్టం ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది. అలా తట్టినప్పుడే తలుపు తీసి ఇంట్లోకి ఆహ్వానించాలి.

Viral: ఇంటికి మరమ్మతులు చేస్తుండగా బయటపడిన చిత్తు పేపర్లు.. పరిశీలించి చూస్తే జిగేల్‌మన్న కళ్లు..
Old Currency Notes
Follow us on

Viral News: ‘దురదృష్టం తలుపు తీసే వరకు తడుతూనే ఉంటుంది. అదృష్టం ఒకసారి మాత్రమే తలుపు తడుతుంది. అలా తట్టినప్పుడే తలుపు తీసి ఇంట్లోకి ఆహ్వానించాలి. లేదంటే.. ఎప్పటిలాగే అదే నిరాశనిస్పృహలు ఉంటాయి.’ అని పెద్దలు చెబుతూ ఉంటారు. కొందరికి అదృష్టం ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. ఒకవేళ వస్తే మాత్రం.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవారు కూడా చాలా తక్కువే. ఇలాంటి అదృష్టమే బ్రిటన్‌లో ఒక వృద్ధ దంపతులను వరించింది. వారిని లక్షాధికారిని చేసింది. మరోలా చెప్పాలంటే.. అదృష్టం తలుపు తట్టగానే వారు ఓపెన్ చేశారు.. దాంతో వారి పంట పడింది.

పూర్వకాలంలో సంపదలను భూమిలో పాతిపెట్టేవారు. కొందరు అడవులు, పర్వతాలలోనూ పాతిపెట్టారు. ఇలాంటి కథలు నిత్యం వింటూనే ఉంటాం. తాజాగా బ్రిటన్‌లోని బ్రిస్టల్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి మరమ్మతుల సమయంలో ఓ వృద్ధ దంపతుల పంట పండింది. 100 సంవత్సరాలకు పైగా పురాతనమైన పాత నోట్లు వారికి లభించాయి. 1916, 1918 మధ్య ముద్రించిన 9 పాత నోట్లు కనిపించాయి. అవి పాతవి కావటంతో వాటికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది. దాంతోపాటు ధర కూడా గట్టిగానే పలికింది. వీటిని వేలం వేయగా.. ఏకంగా రూ. 47 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం వేలంలో వచ్చిన డబ్బుతో ఈ వృద్ధ దంపతులు తమ డైమండ్ జూబ్లీ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని ప్లాన్స్ వేస్తున్నారు. ఇదే కదా అదృష్టం వరించడం అంటే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..