Viral Video: గల్లా పట్టుకొని మరి.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న శునకాలు.. ఫన్నీ వీడియో వైరల్

Dog Fight Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా..

Viral Video: గల్లా పట్టుకొని మరి.. పొట్టు పొట్టుగా కొట్టుకున్న శునకాలు.. ఫన్నీ వీడియో వైరల్
Dog Fight Video

Updated on: Apr 23, 2022 | 1:57 PM

Dog Fight Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. తాజాగా.. శునకాలు గొడవ పడుతున్న వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. వాస్తవానికి కుక్కలు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయి. ఈ పెంపుడు జంతువుల ప్రపంచం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. తమ పరిసరాల్లోకి వచ్చిన కొత్త కుక్కలను చూస్తే.. అవి అచ్చం మనుషుల్లానే అడ్డుకుంటాయి. అంతేకాకుండా యజమానులను కాపాడేందుకు.. అవసరమైతే ప్రాణాలను ఇచ్చేందుకు కూడా వెనకాడవు. అయితే.. వాటి మధ్య కూడా అచ్చం మనుషుల్లానే ఆధిపత్య పోరు ఉంటుంది. ఒక్కోసారి వీధిల్లో కుక్కలు తీవ్రంగా పోట్లాడుకుంటుంటాయి. వాటిని చూస్తుంటే ఒకదానికొకటి ప్రాణాలు తీసుకుంటాయా..? అనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా (social media) లో డాగ్స్ ఫైట్ కు సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.

వాస్తవానికి వైరల్ వీడియోలో.. రెండు కుక్కలు మనుషుల మాదిరిగా రెండు కాళ్లపై నిలబడి పోట్లాడుకుంటున్న సన్నివేశాన్ని చూడవచ్చు. కుక్కలు రెండు కాళ్లపై నిలబడి.. ఒకదానికొకటి మెడలపై కాళ్లు వేసుకొని మరి మొరుగుతున్నాయి. రెండు కుక్కలూ వదలనట్టు కనిపించినా.. ఒకటి మాత్రం బలహీనపడుతున్నట్లు కనిపించింది. ఎందుకంటే.. అది గోడ సందులో ఇరుక్కుపోతుంది. వాటి మధ్య జరిగిన ఈ పోరాటాన్ని చూసి.. మరో రెండు కుక్కలు కూడా అక్కడికి చేరుకుంటాయి. కానీ వాటి కోపాన్ని చూసి అవి క్షణంలోనే వెనకడుగు వేస్తాయి. ఈ ఫైట్‌ని చూసి జనాలు తెగ నవ్వుకుంటున్నారు.

వైరల్ వీడియో..

ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో meow_addictzz అనే యూజర్ షేర్ చేయగా.. ఇప్పటివరకు 7 లక్షల 11 వేల మంది వీక్షించారు. దీంతోపాటు 36 వేల మందికి పైగా లైక్ చేసారు. అదే సమయంలో పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ కుక్కలు అచ్చం మనషుల్లానే పొట్లాడుకుంటున్నాయంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: దేశీ.. ఏసీ.. కూలర్‌‌ను ఇలా కూడా వాడొచ్చా..! వీడియో చూస్తే దిమ్మ తిరగాల్సిందే..

Viral Video: ఎవరైతే మాకేంటి.. సింహాన్ని రఫాడించిన దున్నపోతులు.. వీడియో షాక్ అవ్వాల్సిందే