Viral Video: కుక్క స్కేటింగ్‌ చేయడం ఎప్పుడైనా చూశారా.. తమాషా వీడియో..!

Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలని నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తారు. అందుకే అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా పెంపుడు

Viral Video: కుక్క స్కేటింగ్‌ చేయడం ఎప్పుడైనా చూశారా.. తమాషా వీడియో..!
Dog Skating

Updated on: May 15, 2022 | 6:35 AM

Viral Video: జంతువులకు సంబంధించిన వీడియోలని నెటిజన్లు బాగా ఎంజాయ్‌ చేస్తారు. అందుకే అలాంటి వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు నెటిజన్లని బాగా ఆకర్షిస్తాయి. ఈ తమాషా వీడియోలని చూసిన తర్వాత నెటిజన్లు తెగ నవ్వుకుంటారు. ఒక్కోసారి అవి చేసే విన్యాసాలు చూసి షాక్‌ అవుతారు కూడా. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి వీడియోని మీరు చూసి ఉండరు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క పిల్ల ప్రొఫెషనల్ రోలర్ స్కేటర్‌లా స్కేటింగ్‌ చేయడం మనం గమనించవచ్చు. అది రోలర్‌ వెనకాల పరుగుత్తుతూ చాలా తమాషాగా స్కేటింగ్‌ చేస్తుంటుంది. సాధారణంగా పెంపుడు జంతువులు యజమానులు చేసే పనులని అనుకరిస్తాయి. ఈ కుక్కపిల్ల కూడా ఇక్కడ పిల్లలు చేసే స్కేటింగ్‌ని చాలాసార్లు చూసి స్కేటింగ్‌ చేయడం మొదలు పెట్టింది. కుక్కపిల్ల చేసే తమాషా స్కేటింగ్‌కి అక్కడున్న వారందరు నవ్వడం మనం వీడియోలో చూడవచ్చు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని ఒక నెటిజన్‌ ట్విటర్‌లో షేర్ చేశాడు. దీనికి తోడు ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. వార్త రాసే సమయానికి ఈ వీడియోని ఐదు లక్షల మందికి పైగా చూశారు. ముప్పై వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. గారడీ చేస్తున్న కుక్కపిల్లని చూసి నెటిజన్లు తెగ కామెంట్స్‌ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్‌ తెలియజేయండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Copper Bowls: వేసవిలో రాగి పాత్రలని వాడుతున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..!

Viral Photos: ప్రపంచంలోనే ప్రమాదకరమైన అడవి.. వెళ్లారంటే తిరిగి రావడం దాదాపు అసాధ్యమే..!

Health Tips: డ్రైవింగ్‌ చేసేటప్పుడు వెన్నునొప్పి వేధిస్తుందా.. ఈ చిట్కాలు పాటించండి..!

Loading...
Unable to load recommendations.
Follow Us