Viral Video: ట్రక్ చక్రాల కింద ఇరుక్కున్న చిన్న కుక్క.. సాయం చేసిన మరో కుక్క.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్..

|

Jun 04, 2024 | 1:03 PM

చిన్న కుక్క ప్రాణం ప్రమాదంలో పడింది. ట్రక్కు చక్రాల మధ్య ఇరుక్కుపోయింది. ట్రక్ కదిలి ఉంటే చిన్న కుక్క ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేది. ఇది చూసిన మరో కుక్క వెంటనే తన తోటి కుక్క ప్రాణాలను కాపాడడానికి పరిగెత్తింది. ట్రక్ డ్రైవర్‌ను చిన్న కుక్క ఇరుక్కున్న ప్రదేశానికి లాక్కుని తీసుకుని వెళ్ళింది. ఆపై డ్రైవర్ చిన్న కుక్కకి సహాయం చేశాడు. చిన్న కుక్క మెడలోని తాడు లారీ చక్రాలకు చిక్కుకున్నట్లు వీడియోలో చూడవచ్చు.

Viral Video: ట్రక్ చక్రాల కింద ఇరుక్కున్న చిన్న కుక్క.. సాయం చేసిన మరో కుక్క.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్..
Dog Video Viral
Image Credit source: Twitter/@Gulzar_sahab
Follow us on

భూమిపై అనేక రకాల జంతువులు కనిపించినప్పటికీ.. మానవులతో చాలా బాగా కలిసిపోయే కొన్ని జంతువులు ఉన్నాయి. ఈ జంతువుల్లో కుక్కల పేరు అగ్రస్థానంలో ఉంటుంది. శతాబ్దాలుగా కుక్కలు మానవులకు స్నేహితులుగా పరిగణించబడుతున్నాయి. శునకాల్లో కూడా ఎంతో మానవత్వం కనిపిస్తుంది. పెంపుడు కుక్కలు తమ యజమాని కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టిన సంఘటనలు గురించి అనేకం విన్నాం.. చాలా సార్లు చూశాం కూడా. ఇది మాత్రమే కాదు.. ఏదైనా కుక్క ఎప్పుడైనా ఆపదలో ఉంటే.. మరొక కుక్క ఖచ్చితంగా తమ తోటి కుక్కకు సహాయం చేస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక కుక్క చిన్న కుక్కకు సహాయం చేస్తుంది.

అసలే చిన్న కుక్క ప్రాణం ప్రమాదంలో పడింది. ట్రక్కు చక్రాల మధ్య ఇరుక్కుపోయింది. ట్రక్ కదిలి ఉంటే చిన్న కుక్క ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయేది. ఇది చూసిన మరో కుక్క వెంటనే తన తోటి కుక్క ప్రాణాలను కాపాడడానికి పరిగెత్తింది. ట్రక్ డ్రైవర్‌ను చిన్న కుక్క ఇరుక్కున్న ప్రదేశానికి లాక్కుని తీసుకుని వెళ్ళింది. ఆపై డ్రైవర్ చిన్న కుక్కకి సహాయం చేశాడు. చిన్న కుక్క మెడలోని తాడు లారీ చక్రాలకు చిక్కుకున్నట్లు వీడియోలో చూడవచ్చు. కుక్క కష్టాల్లో ఉన్నవిషయం చూసి.. మరో కుక్క.. చిన్న కుక్క వద్దకు వెళ్లి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంది. అయితే తనంతట తాను ఆ కుక్కకు సహాయం చేయలేనని గుర్తించి అప్పుడు ట్రక్ డ్రైవర్ సహాయం తీసుకుంది. ఈ విధంగా చిన్న కుక్క ప్రాణం కాపాడింది.

వీడియో చూడండి

ఈ హత్తుకునే వీడియో Gulzar_sahab అనే IDలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. కేవలం 43 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 38 వేల మందికి చూశారు. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. అదే సమయంలో వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేశారు. ఒకరు ‘వీడియో నిజంగా చాలా అందంగా ఉంది’ అని కామెంట్ చేయగా మరికొందరు వినియోగదారులు ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..