Viral Video: టీవీ చూస్తున్న కుక్క ఏం చేసిందో తెలుసా.. వైరల్‌ అయిన వీడియో..

మీరు ‘ది లయన్ కింగ్’ సినిమా చూసి ఉంటారు. ఇది 2019 సంవత్సరంలో విడుదలైన ఒక ప్రసిద్ధ అమెరికన్ మ్యూజికల్ డ్రామా చిత్రం...

Viral Video: టీవీ చూస్తున్న కుక్క ఏం చేసిందో తెలుసా.. వైరల్‌ అయిన వీడియో..
Dog

Updated on: Feb 17, 2022 | 8:00 AM

మీరు ‘ది లయన్ కింగ్’ సినిమా చూసి ఉంటారు. ఇది 2019 సంవత్సరంలో విడుదలైన ఒక ప్రసిద్ధ అమెరికన్ మ్యూజికల్ డ్రామా చిత్రం. ఈ సినిమా ఇండియాలో కూడా బాగా ఆడింది. సింబా అనే అడవి రాజు సింహం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో, సింబా అడవికి రాజుగా మారడానికి చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ చివరికి సింబా రాజు అయ్యాడు. అడవిలో ఉన్న ఇతర జంతువులు కూడా అతనిని తమ రాజుగా భావిస్తాయి. రాజును గౌరవిస్తూ ప్రజలు ఎలా తల వంచుకుంటారో మీరు సినిమాల్లో చూసి ఉంటారు. ఈ చిత్రంలో సింబా గౌరవార్థం జంతువులు తల వంచుతాయి. ఈ సినిమా చూస్తున్న కుక్క కూడా తల వంచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో కుక్క టీవీ చూస్తోంది, టీవీలో ‘ది లయన్ కింగ్’ సినిమా వస్తుంది. జీబ్రాస్ నుంచి ఏనుగులు, జిరాఫీలు సహా అన్ని జంతువులు రాజు గౌరవార్థం తల వంచుకునే సీన్ వస్తుంది. అప్పుడు టీవీలో ఈ దృశ్యం చూసి కుక్క కూడా తల వంచుకుని అడవి రాజుని కూడా గౌరవిస్తుంది. ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. కుక్క కూడా టీవీలో చూస్తూ జంతువులను ఎలా అనుకరిస్తుందో మీరు చూడాల్సిందే.

ఇది @buitengebieden_ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ 11 సెకన్ల వీడియోకు ఇప్పటివరకు 4 లక్షల 38 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 28 వేల మందికి పైగా వీడియోను కూడా లైక్ చేశారు.

Read Also.. Viral Video: ఫొటోగ్రాఫర్‌పై పడగెత్తిన పాము..పరుగులంకించుకున్నా వదల్లేదు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us