Viral: ఛీ.. ఇదేం పాడుపని.. కడుపునొప్పితో ఆస్పత్రికొచ్చిన యువకుడు.. ఎక్స్‌రే తీసి ఖంగుతిన్న డాక్టర్లు!

|

Sep 15, 2022 | 8:20 PM

అతడి వయస్సు 27 ఏళ్లు. తీవ్రమైన కడుపునొప్పిని తాళలేక ఆసుపత్రికి వచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడి టెస్ట్ చేయగా..

Viral: ఛీ.. ఇదేం పాడుపని.. కడుపునొప్పితో ఆస్పత్రికొచ్చిన యువకుడు.. ఎక్స్‌రే తీసి ఖంగుతిన్న డాక్టర్లు!
Xray
Follow us on

అతడి వయస్సు 27 ఏళ్లు. తీవ్రమైన కడుపునొప్పిని తాళలేక ఆసుపత్రికి వచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడి టెస్ట్ చేయగా.. అనంతరం వచ్చిన ఎక్స్‌రే రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇంతకీ ఆ ఎక్స్‌రేలో ఏం కనిపించిందంటే.? తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే..

వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 27 ఏళ్ల యువకుడు బుధవారం తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ బుర్దవాన్ నగరంలోని ఆస్పత్రికి వచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడ్ని పరీక్షించి.. ఎక్స్‌రే రిపోర్ట్స్ చూడగా దెబ్బకు షాకయ్యారు. అతడి కడుపులో సుమారు 7 అంగుళాల పొడవైన డియోడ్రెంట్ బాటిల్ ఉంది. వెంటనే సదరు యువకుడికి రెండు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించి.. కడుపులోనుంచి ఆ బాటిల్‌ను బయటికి తీశారు.

కాగా, అసాధారణ లైంగిక కోరికల కారణంగా సదరు యువకుడు మలద్వారం ద్వారా బాటిల్‌ను జొప్పించుకున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉందని.. వారం పాటు పర్యవేక్షణలో ఉంచామని వెల్లడించారు. ఇక ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుండటంతో.. ఇదేం పాడుపని అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.