Viral: ఎలారా ఇలా.! కడుపునొప్పి అని ఆస్పత్రికి.. కాసేపటికే CT స్కాన్‌లో..

మెంటల్ హెల్త్ బాగోలేని వ్యక్తులను మనం తరచూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఓ వ్యక్తి గత రెండు నెలలుగా గడియారాలు, ఇనుప మేకులు, బోల్టులు తన ఆహారంగా తీసుకున్నాడు. ఈ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Viral: ఎలారా ఇలా.! కడుపునొప్పి అని ఆస్పత్రికి.. కాసేపటికే CT స్కాన్‌లో..
Viral

Updated on: Oct 18, 2025 | 9:07 AM

జైపూర్‌లోని సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలోని డాక్టర్లు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. రోగి ఉదరం నుంచి ఇనుప మేకులు, నట్ బోల్టులతో పాటు లోహపు గడియారాన్ని తొలగించారు. అక్కడ ప్రధాన డాక్టర్ షాలు గుప్తా మాట్లాడుతూ.. ‘నాగౌర్‌కు చెందిన సదరు రోగి కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరాడు. OPDలో ఉన్న అతడి పరిస్థితిని చూసి వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్ చేయించాం’ అని ఆమె చెప్పారు. సదరు బాధితుడికి టెస్టులు చేయగా.. జీర్ణవ్యవస్థలో ఒక లోహపు గడియారం ఇరుక్కుపోయిందని.. పెద్ద ప్రేగులో ఇనుప మేకులు, నట్-బోల్ట్‌లు ఇరుక్కుపోయాయని తేలింది.

వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సన్నద్ధం అయ్యారు. ముందుగా ఎండోస్కోపీ ద్వారా వస్తువులను తొలగించాలని ప్రయత్నించారు. ఒకట్రెండుసార్లు ప్రయత్నించినా చివరికి ఫెయిల్ అయ్యారు. ఇక ఆ తర్వాత రోగికి టెలిస్కోప్(వీడియో అసిస్టెడ్ థెరౌస్ సూర్యయ్) ద్వారా ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు డాక్టర్లు. దీని ద్వారా రోగి పొత్తికడుపు నుంచి వాచ్, బోల్ట్ లను విజయవంతంగా తొలగించగలిగారు. ఈ శస్త్రచికిత్స దాదాపు మూడు గంటలు పట్టిందన్నారు. కాగా, రోగి మెంటల్ కండీషన్ సరిగ్గా లేదని.. గత రెండు నెలలుగా ఇనుప వస్తువులను మింగేస్తున్నాడని వైద్యులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఎవడు మమ్మీ వీడు.! 42 ఫోర్లతో 437 పరుగులు.. దెబ్బకు బౌలర్లను పేకాటాడేశాడుగా