
భోపాల్‌లోని ఎయిమ్స్ ఆస్పత్రికి ఓ 30 ఏళ్ల బాధితుడు ఛాతీలో బాధ.. శ్వాసలో ఇబ్బంది సమస్యలతో వచ్చాడు. గత 18 నెలలుగా ఈ లక్షణాలు ఉన్నట్లు వెల్లడించాడు. దీంతో అక్కడి డాక్టర్లు డాక్టర్లు పూర్తిస్థాయి శారీరక పరీక్షలు చేవారు. ఛాతీ ప్రాంతంలో ఏదైనా వాపు లేదా ఇతర శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయా అని చూసారు. అయితే ఎక్స్ రే తీయగా.. అందులో ఛాతీ కుడి వైపున భారీ కణితి ఉన్నట్లు తేలింది. దాని పరిమాణం, స్థానం.. చుట్టుపక్కల అవయవాలపై దాని ప్రభావాన్ని అధునాతన ఇమేజింగ్ పరీక్షల ద్వారా క్లియర్‌గా తెలుసుకున్నారు. ఆ ట్యూమర్ రిబ్స్‌ను చుట్టేసి, కుడి ఊపిరితిత్తిపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తోంది. దాని కారణంగా ఛాతిలో గాలి ప్రవాహం తగ్గడం, ఊపిరితిత్తుల కదలిక తక్కువగా ఉండడం వంటి లక్షణాలను గుర్తించారు. దీంతో అక్కడి కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ (CTVS) విభాగానికి చెందిన వైద్యులు రంగంలోకి దిగారు. విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స చేసి బాదితుడికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
బయటకు తీసిన కణితి సుమారు 2 కిలోల బరువుతో పాటు 20 సెంటీమీటర్ల పొడవు ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. అతను పూర్తిగా కోలుకున్నాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఇంత క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతం కావడం దేశ వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అజయ్ సింగ్ అన్నారు. గ్రామీణ ప్రాంతాలు, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు అధునాతన వైద్యసేవలు అందించడంలో ఎయిమ్స్ భోపాల్ ముందు ఉంటుందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..