ప్రస్తుతం వాటర్ బాటిల్స్ వినియోగం అనివార్యంగా మారింది. ప్రయాణాలు చేసే సమయంలో వాటర్ బాటిల్స్‌ను కొనుగోలు చేస్తుంటాం. ప్రయాణాలు చేసే సమయంలో మంచి నీటిని తాగాలనే ఉద్దేశంతో చాలా మంది కొనుక్కొని తాగుతున్నారు. అయితే మనం చూసే వాటర్ బాటిల్స్‌లో ఎక్కువగా బ్లూ కలర్ క్యాప్‌తో ఉన్నవే ఉంటాయి. ఇంతకీ వాటర్ బాటిల్ క్యాప్స్ బ్లూ కలర్ క్యాప్స్‌నే ఎందుకు ఉపయోగిస్తారు.? దీని వెనక అర్థం ఏంటి.? అలాగే ఒక్కో రంగుకు ఉన్న అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాటర్ బాటిల్‌కు ఉండే బ్లూ కలర్ క్యాప్ మినరల్ వాటర్‌ను సూచిస్తుంది. నీలి రంగు క్యాప్ వాటర్ బాటిల్స్‌లో ఉండే నీరు మినరల్ వాటర్‌గా చెబుతుంటారు. ఇక మరికొన్ని బాటిల్స్‌ను గమనిస్తే.. తెలుపు, గ్రీన్ కలర్స్‌లో క్యాప్స్ ఉండడానికి గమనించే ఉంటారు. అయితే గ్రీన్ కలర్ క్యాప్ ఉండే బాటిల్‌లో ఉండే నీళ్లకు అదనపు ఫ్లేవర్స్‌ను యాడ్ చేశారని అర్థం. కొన్ని రకాల వాటర్ బాటిల్ కంపెనీలు నీటికి అదనంగా ఎలక్ట్రోలైట్స్ వంటి ఫ్లేవర్స్‌ను యాడ్ చేస్తాయి. ఇలాంటి వాటర్ బాటిల్స్‌పై ఉన్న కవర్‌ను గమనిస్తే మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నీటిలో యాడ్ చేసిన ఫ్లేవర్స్‌ను అందులో స్పష్టంగా పేర్కొంటారు.
ఇదిలా ఉంటే మరికొన్ని వాటర్ బాటిల్స్‌కు క్యాప్స్‌ను రెడ్, ఎల్లో, బ్లాక్, పింక్ కలర్స్‌లో ఉంటాయి. రెడ్ కలర్ క్యాప్‌తో ఉండే వాటర్ బాటిల్స్‌లో కార్బోనేటెడ్ నీరు ఉందని అర్థం చేసుకోవాలి. ఇక ఎల్లో కలర్ క్యాప్‌తో ఉన్న వాటర్ బాటిల్‌లో విటమిన్లు, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని చెప్పడానికే క్యాప్స్‌కు ఒక్కో కలర్‌ను కేటాయిస్తారు.
ఇక బ్లాక్ కలర్ క్యాప్ విషయానికొస్తే ఈ వాట్ బాటిల్‌లో ఆల్కలీన్‌తో కూడిన నీరు ఉందని అర్థం చేసుకోవాలి. బ్లాక్ కలర్ క్యాప్ ఉండే వాటర్ బాటిల్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి కేవలం ప్రీమిం నీటి ఉత్పత్తులకు మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్కువగా సెలబ్రిటీలు ఇలాంటి నీటిని తాగుతుంటారు. ఇక గులాబీ కలర్ క్యాప్‌తో ఉండే వాటర్ బాటిల్స్ విషయానికొస్తే.. ఇది నీటి గురించి చెప్పేది కాదు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించే పలు స్వచ్ఛంద ససంస్థలు ఇలాంటి క్యాప్స్‌ను ఉపయోగిస్తాయి.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..