Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..

|

Jan 28, 2022 | 9:15 PM

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని..

Viral Video: పెళ్లి చేసుకోవడానికి ఎంతో అందంగా ముస్తాబైన వధువు.. కానీ పాపం..
Viral
Follow us on

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. తమ వివాహాన్ని ఎంతో ఘనంగా జరుపుకోవాలని.. ఆ అందమైన జ్ఞాపకాలను ఎంతో భద్రంగా దాచుకోవాలనుకుంటారు. ఇక అబ్బాయిలు.. అమ్మాయిలు పెళ్లి (Marriage) గురించి కనే కలల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహం రోజున అందంగా మూస్తాబు కావాలనుకుంటారు. ఇక అబ్బాయిల కంటే అమ్మాయిల గురించి తెలిసిందే. పట్టు చీర.. భారీ నగలు… ఇలా ఒక్కటేమిటీ ఎంతో అందంగా రెడీ అయ్యి సంతోషంగా పెళ్లి మండపానికి ఎంట్రీ ఇస్తారు. కానీ కాసేపట్లో పెళ్లి అనగా.. పనిచేసే ఆఫీస్ నుంచి కాల్ వచ్చి వర్క్ చేయమంటే ఎలా ఉంటుంది. కోపంతోపాటు.. ఎంతో భాద కూడా కలుగుతుంది కదా. నిజమే.. ఇలాంటి చేదు అనుభవమే ఓ కొత్త పెళ్లి కూతురికి ఎదురైంది.

కాసేపట్లోకి సంతోషంతో పెళ్లి మండపానికి వెళ్లాల్సిన వధువు.. ఆఫీస్ ఫోన్ కాల్స్ మాట్లాడుతూ.. లాప్ టాప్ ముందు కూర్చుని బాధతో వర్క్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఓ వధువు.. పెళ్లి కోసం ఎంతో అందంగా రెడీ అయ్యింది. కానీ అదే సమయంలో ఆఫీస్‏కు సంబంధించిన కొన్ని సమస్యలను లాప్ టాప్ ముందు కూర్చుని పరిష్కరిస్తూ కూర్చుంది.. ఓవైపు.. వర్క్ చేస్తూనే మరోవైపు వరుస ఫోన్ కాల్స్ ఆమెకు చిరాకు పుట్టించాయి. ఆఫీస్ వర్క్ ఎవరైనా చూడండి.. ఈరోజు నా పెళ్లి అంటూ ఎంతో బాధతో ఆ వధువు వాపోయింది. ఈ వీడియోను మేకప్ ఆర్టిస్ట్ సోనా కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. పాపం ఆ పెళ్లి కూతురు వీడియోను మీరు ఓసారి చూసేయ్యండి..

Also Read: Aadavallu Meeku Johaarlu: ఆడవాళ్లు మీకు జోహార్లు రిలీజ్ అయ్యేది అప్పుడే.. విడుదల తేది ప్రకటించిన చిత్రయూనిట్..

Viral Photo: ఈ ఫోటోలో చిన్నారి ఇప్పుడొక క్రేజీ హీరోయిన్.. కళ్లతోనే కట్టిపడేస్తుంది.. ఎవరో గుర్తుపట్టారా.?

Allu Shirish: మల్టీస్టారర్ ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లువారబ్బాయి.. మరో హీరో ఎవరంటే..

Janhvi Kapoor: టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన అతిలోక సుందరి తనయ.. ఏ సినిమాతో అంటే..