Viral Video: పెళ్లి వేడుకలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు ఖంగుతిన్న వరుడు.. తెగ సిగ్గుపడిపోయిన వధువు!

|

Jul 21, 2022 | 6:39 PM

పెళ్లిళ్ల సీజన్‌తో సంబంధం లేకుండానే నెట్టింట మ్యారేజ్ వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి.. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు

Viral Video: పెళ్లి వేడుకలో ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌కు ఖంగుతిన్న వరుడు.. తెగ సిగ్గుపడిపోయిన వధువు!
Marriage Video
Follow us on

పెళ్లిళ్ల సీజన్‌తో సంబంధం లేకుండానే నెట్టింట మ్యారేజ్ వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు ఓ లుక్కేయొచ్చు. సాధారణంగా పెళ్లిళ్లలో వధూవరుల ఫ్రెండ్స్ అల్లరి అంతా ఇంతా ఉండదు. సందు దొరికితే చాలు.. వధూవరులను ఆటపట్టిస్తుంటారు. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

వైరల్ వీడియో ప్రకారం.. పెళ్లి రిసెప్షన్‌ జరుగుతుండగా వరుడు తన ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేస్తున్నట్లుగా మీరు చూడవచ్చు. తనకోసం గిఫ్ట్ ఏం తీసుకొచ్చారన్న కుతూహలంతో దాన్ని ఓపెన్ చేసిన వరుడికి గట్టి షాక్ తగిలింది. అందులో ఉన్నది చూసి అతడు ఖంగుతినగా.. వధువు మాత్రం తెగ సిగ్గుపడిపోయింది. ఇంతకీ ఆ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా.? ‘కండోమ్’ ప్యాకెట్ అండీ.. అందుకే వధూవరులు అంతలా సిగ్గుపడిపోయారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి. కాగా, ‘kichus_abi’ అనే నెటిజన్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.