Viral Video: పిల్ల కప్ప ,తల్లి కప్ప అంటూ.. కప్పలతో ఆడుకుంటున్న చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో

Viral Video: స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ మనం ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. ఎక్కువగా జంతువులు, చిన్న పిల్లలకు..

Viral Video: పిల్ల కప్ప ,తల్లి కప్ప అంటూ.. కప్పలతో ఆడుకుంటున్న చిన్నారి..  నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో
Cute Little Girl Plays With

Updated on: Nov 14, 2021 | 4:22 PM

Viral Video: స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ మనం ఎన్నో వైరల్‌ వీడియోలు చూస్తుంటాం. ఎక్కువగా జంతువులు, చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లను బాగా ఆకర్షిస్తున్నాయి. ఎందుకంటే చిన్నపిల్లల ఆటలు ఎంతో క్యూట్‌గా ఉంటాయి. అంతేకాదు కల్మషం లేని ఆ చిన్నారులను చూడగానే ఎంతో ఆనందం కలుగుతుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. లక్షల మంది వీక్షిస్తున్న ఈ వీడియోనూ మీరూ చూసేయండి.

మీరు కప్పను ఎప్పుడైనా ముట్టుకున్నారా…ముట్టుకుని ఉండరు కదా… కానీ ఈ వీడియోలో ఓ చిన్నారి కప్పలకు తెగ ముద్దులు పెట్టేస్తోంది. వాటిని హత్తుకుంటోంది కూడా . కప్పలంటే ఆ చిన్నారికి ఎంతో ఇష్టమట. ఈ పాప పేరు లిల్లీ. టిక్‌టాక్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ చిన్నారి చాలా ఫేమస్‌. అంతేకాదు ఈ చిన్నారికి లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె పేరెంట్స్… తరచూ పాప వీడియోలని సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజా వీడియో “ఇది తల్లి కప్ప… ఇది పిల్ల కప్ప” అని ఆ పాపకు ఆమె తల్లి… 2 కప్పలను ఇచ్చింది. వాటితో ఎంతో సంతోషంగా ఆడుకుంటోంది లిల్లీ. ప్రస్తుతం ఈ వీడియోని చూస్తున్న నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మనం మన పిల్లలకు ప్రకృతిని పరిచయం చెయ్యాలి. మన చుట్టూ ఉన్న ప్రాణుల పట్ల వారికి జాలి, దయ కలిగేలా నేర్పాలి. మనం ఈ భూమిపై ఉన్న ఇతర జీవులపై ఆధారపడి జీవిస్తున్నామనే నిజాన్ని పిల్లలకు తెలిసేలా చెప్పాలి” అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

 

Also Read: అయినవారిని పోగొట్టుకుంది.. అవకాశవాద చుట్టాలను కాదని.. తనకు అండగా నిలబడ్డ రిక్షాకార్మికుడికి కోట్ల ఆస్తి ఇచ్చింది!