Viral Video: ఎంజాయ్‌మెంట్ అంటే ఈ పిల్లిదే.. పార్క్‌లో ఏం చేసిందో మీరే చూడండి.. వీడియో..

|

Jan 02, 2022 | 1:10 PM

Cat Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు అనునిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వాటిల్లో

Viral Video: ఎంజాయ్‌మెంట్ అంటే ఈ పిల్లిదే.. పార్క్‌లో ఏం చేసిందో మీరే చూడండి.. వీడియో..
Cat Viral Video
Follow us on

Cat Viral Video: సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు అనునిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అయితే.. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. తాజాగా ఓ పిల్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా పిల్లులు చాలా అందంగా ఉంటాయి. చిన్న వయస్సులో ఉన్నప్పుడు.. అవి ఎంతో అల్లరి చేస్తుంటాయి. చాలా మంది వ్యక్తులు పిల్లులను అశుభకరమైనవిగా భావిస్తారు.. కానీ కొంతమంది వాటిని ఇష్టంతో పెంచుకుంటుంటారు. కొన్ని సందర్భాల్లో పిల్లులు ఎంతో సందడి చేస్తుంటాయి. తమ పెంపుడు కుక్కలతో సైతం ఆడుకుంటుంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా.. ఓ పిల్లి చిల్డ్రన్ పార్క్ తెగ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం పిల్లి చలాకీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు.

సాధారణంగా.. చిన్నతనంలో మీరు స్లైడింగ్ పూల్‌లో ఆడుకోని ఉంటారు. ప్రతి పార్కులో పిల్లలు ఆడుకోవడానికి స్లైడింగ్ పూల్స్ ఉంటాయి. జారుడు బల్లా (స్లైడింగ్ పూల్) పై ఆడుకుంటూ జారుతూ ఆనందిస్తుంటారు. ఇలాంటి సన్నివేశాలను మనం చూసేఉంటాం. ఈ వైరల్ అవుతున్న వీడియోలో పిల్లి కూడా అలాంటిదే చేస్తోంది. స్లైడింగ్ పూల్‌పై పిల్లి ఎలా ఎక్కి ఎలా కిందికి జారిపోతుందో వీడియోలో మీరు చూడవచ్చు. ఇలా ఆడుకుంటూ పిల్లి ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడండి. స్లైడింగ్ పూల్ పైకి ఎక్కి జారుతూ ఉంటుంది. ఈ వీడియో చూసి చాలామంది నెటిజన్లు బాల్యం గుర్తుకు వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ వీడియో.. 

Also Read:

Viral Video: సోదరితో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన వధువు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో