Petrol Free: రూ. లక్ష విలువైన పెట్రోల్ ఫ్రీ.. యూట్యూబర్ క్రేజీ ఆఫర్.. పండగ చేసుకున్న వాహనదారులు..

|

May 25, 2022 | 8:35 AM

Petrol Free: అసలే దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు సామాన్యులకు మోయలేని భారంగా మారాయి. లీటర్ పెట్రోల్ ఇప్పటికే సెంచరీ దాటేయగా.. డీజిల్ రేటు కూడా దాదాపు అలాగే ఉంది. వీటిని అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Petrol Free: రూ. లక్ష విలువైన పెట్రోల్ ఫ్రీ.. యూట్యూబర్ క్రేజీ ఆఫర్.. పండగ చేసుకున్న వాహనదారులు..
Petrol Free
Follow us on

Petrol Free: అసలే దేశంలో పెట్రోల్ డీజిల్ రేట్లు సామాన్యులకు మోయలేని భారంగా మారాయి. లీటర్ పెట్రోల్ ఇప్పటికే సెంచరీ దాటేయగా.. డీజిల్ రేటు కూడా దాదాపు అలాగే ఉంది. వీటిని అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం కోసం పెద్దగా తగ్గించటం లేదు. తాజాగా రెండు రోజుల కిందట కేంద్ర ప్రభుత్వం వీటిపై విధిస్తున్న సుంకాన్ని కూడా కొంత మేర తగ్గించింది.

ఈ నేపథ్యంలో ఒక యూట్యూబర్ ప్రజలకు రూ. లక్ష విలువైన పెట్రోల్ ఉచితంగా ఇస్తానంటూ ప్రకటించాడు. షాకింగ్ ఉంది కదూ.. కానీ ఇది నిజమే. అయితే ఇందులో ఒక చిన్న మెలిక కూడా ఉంది. అదేంటంటే.. తన వీడియోను వైరల్ చేస్తానని సదరు వ్యక్తి అకౌంట్ సబ్ స్కైబర్లు హామీ ఇవ్వాలని అన్నాడు. అలా చేస్తేనే లక్ష రూపాయలు విలువైన ఫ్యూయల్ ఉచితంగా అందిస్తానని అన్నాడు. ఫాలోవర్లు దీనికి ఓకే అనటంతో అతడు ఫ్రీ పెట్రోల్ ఆఫర్ చేశాడు. అయితే అతని ఫాలోవర్లు సైతం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అతను చేసిన ఈ వీడియోను వారు వైరల్ చేశాడు. పెట్రోల్ బంకులో స్వయంగా అతనే అందరికీ పెట్రోల్ నింపుతూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ఇంతకీ ఆ యూట్యూబ్ ఛానల్ పేరేంటని అనుకుంటున్నారా.. క్రేజీ ఎక్స్ వైజెడ్. దీనిని రన్ చేస్తోంది అమిత్ అనే వ్యక్తి. అతడు ఇంధనం ఉచితంగా అందిస్తున్న ఈ వీడియోకు ఏకంగా 40 లక్షల వ్యూవ్స్ వచ్చాయి. అంటే అతను ఉచితంగా ఇచ్చిన పెట్రోల్ ఖర్చు అతనికి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మరింత వైరల్ కావటంతో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మెుత్తంలో డబ్బు సంపాదించి పెడుతుందని తెలుస్తోంది. అమిత్ చేసిన ఈ క్రేజీ పనికి ప్రజల నుంచి మంచి స్పందనే కాకుండా అతని ఛానల్ కు రీచ్ కూడా పెరిగింది.

సదరు యూట్యూబర్ తన వీడియోలో ఒక పెట్రోల్ బంక్ ముందు ఫ్రీ పెట్రోల్ అనే బ్యానర్ అంటించాడు. అతను ఉచితంగా పెట్రోల్ అందిస్తున్నానంటూ.. అటుగా వెళ్లే వాహనదారులను పిలవటం అందులో మనం గమనించవచ్చు. కొంత ఫ్రీగా ఇవ్వటం ద్వారా దానిని తిరిగి సంపాదించుకోవటం చాలా మంచి ఆలోచన అంటూ అందరూ అతడిని అభినందిస్తున్నారు.