పెళ్లైన కొత్త జంట తన జీవిత ప్రయాణాన్ని హనీమూన్‌తో మొదలుపెడతారు. తమ జీవితంలో హనీమూన్ అనేది ఎప్పటికీ మధురంగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు. అయితే నేటి యువత లైకుల కోసం నాలుగు గోడల మధ్య జరిగే విషయాలను సైతం.. ఇంటర్నెట్‌లో పట్టేసి అందరికీ తెలిసేలా చేస్తున్నారు. ఇక వైరల్ అయ్యేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వివాహం చేసుకున్న ఓ కొత్త జంటకు సంబంధించిన హనీమూన్ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఆ వీడియో చూస్తే మీరు కడుపుబ్బా నవ్వుతారు.
ఫస్ట్ నైట్ రోజు వధువు గదిలోకి వెళ్లగానే ఫోన్ ఓపెన్ చేసి.. వీడియో తీస్తుండగా.. వరుడు ఆమె చున్నీతో ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత వధువు ధరించిన ఆభరణాలు అన్ని తీస్తాడు. ఇక లాస్ట్‌లో ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగుతారు. ‘రియాలిటీ ఆఫ్ వెడ్డింగ్ నైట్’ ఇదేనంటూ ఆ జంట ఈ వీడియోను పోస్ట్ చేసింది.
‘పాపం! తొలిరాత్రి వరుడు చాలా కష్టపడ్డాడు’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘సినిమాల్లో ఫస్ట్ నైట్ గురించి చూపించేది తప్పు అంటూ’ మరొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీనిని నెటిజన్లు వరుసపెట్టి లైకులతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరూ ఓ లుక్కేయండి.