Wedding: ఒకరిని ప్రేమించడం అంటే…వారి అభిరుచులను, ఆలోచనలను గౌరవించడం. ప్రేమించిన వారి ఇష్టాలను తెలుసుకుని.. వాటికి విలువ ఇవ్వాలి. అలా తనకు కాబోయే భర్త, లేదా భార్య ఇష్టాలను తెలుసుకున్న జంట జీవితాలు సంతోషంగా షాపీగా సాగిపోతుంటాయి. అలా ప్రేమించిన పెళ్లి వరకు వచ్చిన ఓ జంటప్రేమకథ విచిత్రంగా ఉంది. వధువు… పెళ్లి మండపంలో ఊహించని విధంగా సర్‌ఫ్రైజ్ చేసింఇ.. జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా తీర్చిదిద్దింది. పెళ్లి రోజంటేనే ప్రత్యేకమైన రోజు.. అలాంటి రోజును వధువు మరింత ప్రత్యేకంగా మలిచింది. చైనాలో జరిగిన ఓ పెళ్లిలో వధూవరుల వివాహ దుస్తులకు సంబంధించిన ఉదంతం ఇది. విషయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. ఇక్కడ చైనీస్ వధువు.. తను ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న వరుడికి ప్రత్యేకమైనది, ఎప్పటికీ గుర్తుండిపోయేలా, వెలకట్టలేని బహుమతి ఇవ్వాలని భావించింది. అందుకోసం.. తను స్కూల్ యూనిఫాం ధరించింది. అవును, ఇది చూసిన వరుడు షాక్ అవ్వలేదు.. కానీ భావోద్వేగంతో ఏడవడం ప్రారంభించాడు.
అసలు విషయం ఏమిటంటే..
నివేదిక ప్రకారం, చైనాలోని అన్హుయ్ ప్రావిన్స్‌లో జరిగింది ఈ సంఘటన. బోజౌ అనే ప్రదేశంలో ఒక ప్రత్యేకమైన వివాహం జరిగింది. అసలు ఈ పెళ్లిలో వధువు అడుగుపెట్టగానే..ఆమె ఎంట్రీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఖరీదైన పెళ్లి దుస్తుల్లో కాకుండా.. తన సెకండరీ స్కూల్ యూనిఫామ్‌తో వచ్చింది. ఇది చూసి వరుడు ఉద్వేగానికి లోనయ్యాడు. వాస్తవానికి, ఇది 11 సంవత్సరాల క్రితం ఈ జంట మొదటిసారి కలుసుకున్న స్కూల్ యూనిఫాం.
పెళ్లికి స్కూల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు?
ఈ జంట 11 ఏళ్లుగా ఒకరికొకరు మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా వీరి బంధం బలహీనపడలేదు. చిన్ననాటి స్నేహం పెళ్లి దశకు చేరుకున్న క్షణంలో ఆ ఇద్దరూ కలిసి చదువుకున్న స్కూల్ యూనిఫామ్‌ను పెళ్లి దుస్తులగా ధరించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు.. వధువు లోపలికి రాగానే వరుడు ఆమెను చూసి భావోద్వేగానికి లోనయ్యాడు.. వెంటనే ఆమెను హత్తుకుని ఏడ్చేశాడు. వరుడు మంచి సూట్ వేసుకుని ఉంటే.. వధువు మాత్రం చిన్ననాటి స్కూల్ జెర్సీ, జీన్స్, బ్లాక్ షూస్, హై పోనీ టైల్ లో తొలిసారి చూసిన చిన్న నాటి స్నేహితురాలిగా వస్తుందని ఊహించలేదు. హృదయాన్ని హత్తుకునే ఈ క్షణం ఇంటర్నెట్ ప్రజల హృదయాలను గెలుచుకుంది. కొంతమంది వినియోగదారులు చెప్పారు – వివాహ దుస్తుల కంటే స్కూల్ యూనిఫాం అనే కాన్సెప్ట్ ఎంతో అందమైనది అంటూ పలువురు నెటిజన్లు స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..