పొడవాటి నల్లటి జుట్టు అందాన్ని మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే చాలా మంది అమ్మాయిలు పొడవాటి, ముదురు ,మందపాటి జుట్టు కలిగి ఉండాలని కోరుకుంటారు. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు కూడా పొడవాటి జుట్టుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. పొడవాటి జుట్టు కోసం అమ్మాయిలు చాలా కష్టపడతారు. అయితే, అక్కడి మహిళలకు ఆ సమస్య లేదు. వారికి సహజంగానే నల్లని తాచు పాములా జుట్టు వారి సొంతం. చైనా మహిళలు పొడవాటి జుట్టుకు చాలా ఫేమస్. అంతేకాదు సిల్కీ హెయిర్ వారి జుట్టు ప్రత్యేక లక్షణం. చైనాలోని పురాతన గ్రామమైన హువాంగ్లూలోని మహిళల జట్టు గురిచి తెలుసుకుందాం..
స్త్రీల జుట్టు ఒకటిన్నర నుంచి రెండు మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటుంది. ఈ గ్రామాన్ని లాంగ్ హెయిర్ విలేజ్ అని కూడా అంటారు. ఇందుకు గాను ఆ ఊరి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా నమోదైంది. స్త్రీ జుట్టు పొడవు ఆమె కుటుంబానికి అదృష్టం కలిగిస్తుందని ఇక్కడి స్థానికులు నమ్ముతారు.
నిజ జీవితంలో..
ఈ ప్రాంతం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి మహిళలు జీవితంలో ఒక్కసారే జుట్టు కత్తిరించుకుంటారు. ఇక్కడి మహిళలు తమ 18వ పుట్టినరోజున హ్యారీకట్ చేసుకోంటారు. అంటే, ఇలా జుట్టు చేయించుకున్న అమ్మాయి పెళ్లికి సిద్ధమైందని అర్థం. భాగస్వామిని వెతుకుతున్నప్పుడు జుట్టును కప్పుకుంటారు. కత్తిరించిన జుట్టు ఆమె అమ్మమ్మ వద్ద ఉంటుంది. ఆ జట్టును వివాహానంతరం వరుడికి బహుమతిగా ఇస్తారు. పెళ్లికి ముందు అమ్మాయిలు తమ జుట్టును భర్తకు చూపిస్తారు.
గిన్నిస్ బుక్‌లో నమోదైన పేరు-
ఈ గ్రామం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా పేరు నమోదు చేసుకుంది. ఈ గ్రామం పొడవాటి వెంట్రుకలు ఉన్న గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ గ్రామాన్ని లాంగ్ హెయిర్ విలేజ్ అని కూడా పిలుస్తారు. ఈ గ్రామం పేరు హువాంగ్లూ. ఇది జిన్షా నది ఒడ్డున ఉంది. రెడ్ యావో ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. ఈ మహిళలు పొడవాటి, మందపాటి, నల్లటి జుట్టుకు ప్రసిద్ధి చెందారు.
పొడవాటి జుట్టు రహస్యం ఇదే-
అయితే ఇక్కడి మహిళల పొడవాటి జుట్టు రహస్యం బియ్యం నీరు. వారు షాంపూ వంటి వాటిని ఉపయోగిచరు. అలాగే అక్కడి నదిలోని నీళ్లతో జుట్టును కడుగుతారు.ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం మార్చి 3న పొడవాటి కేశవుల పండుగ జరుపుకుంటారు. ఇందులో మహిళలు పాడటం, నృత్యం చేయడం ద్వారా తమ జుట్టును ప్రదర్శిస్తారు. వీరి పండుగను చూసేందుకు ఇక్కడికి పెద్ద ఎత్తున టూరిస్టులు ఇక్కడి వస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం