Viral Video: పిల్లికి చుక్కలు చూపించిన కాకి.. చివరకు అది ఏం చేసిందంటే.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నిత్యం వందల రకాల వీడియోలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి.

Viral Video: పిల్లికి చుక్కలు చూపించిన కాకి.. చివరకు అది ఏం చేసిందంటే.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..
Cat And Crow

Updated on: Jul 28, 2022 | 7:58 PM

Viral video: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు నిత్యం వందల రకాల వీడియోలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భయాన్ని కలగజేస్తే మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. జంతువులు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇతర జంతువులతో ఆడుకుంటూ చాలా సరదాగా గడుపుతూ ఉంటాయి. పిల్లి, కుక్క, ఎలుక, పిల్లి ఇలా వైరం మరిచి స్నేహంగా ఉంటాయి. ఇక పక్షుల విషయానికొస్తే మనకు ఎక్కువగా కనిపించే వాటిలో కాకులు ఒకటి. ఇవి చాలా హుషారుగా ఉంటాయి. తాజాగా ఓ కాకి చేసిన పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కాకి పిల్లిని ఆటపట్టించింది. ఇప్పుడు ఈవీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పార్క్ లో పడుకున్న ఒక పిల్లిని కాకి గమనించింది. పిల్లి దానిమానన  అది ఉంటే కాకి మెల్లగా దాని దగ్గర రావడానికి ప్రయతించింది. ఆ పిల్లి వెనక్కి తిరిగి చూడగానే ఏమీ తెలియనట్టుగా దొంగచూపులు చూస్తోంది. మళ్లీ కాకి మెల్లగా పిల్లిదగ్గరకు రాగానే పిల్లి అలెర్ట్ అయ్యి కాకి వైపు చూస్తుంది. ఈ సారి కూడా కాకి ఏమి తెలియనట్టు దొంగచూపులు చూస్తుంది. ఇలా కొద్దిసేపటి తర్వాత ఆ పిల్లి ఈ కాకి ఎదో చేసేలా ఉంది అని అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  

Loading...
Unable to load recommendations.
Follow Us