Viral Video: ఆత్మవిశ్వాసం అంటే ఇదే.. పిల్లిని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్

Cat Amazing Jump: మీరు ఏదైనా కోరుకుంటే.. దానికోసం బలంగా ప్రయత్నిస్తే.. అది మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ వింటూనే ఉంటాం. వాస్తవానికి మీకు మీ మనస్సుపై నమ్మకం ఉంటే..

Viral Video: ఆత్మవిశ్వాసం అంటే ఇదే.. పిల్లిని చూసి నేర్చుకోవాలంటున్న నెటిజన్లు.. వీడియో వైరల్
Cat Viral Video

Updated on: Dec 21, 2021 | 9:01 AM

Cat Amazing Jump: మీరు ఏదైనా కోరుకుంటే.. దానికోసం బలంగా ప్రయత్నిస్తే.. అది మీ సొంతం అవుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడూ వింటూనే ఉంటాం. వాస్తవానికి మీకు మీ మనస్సుపై నమ్మకం ఉంటే.. ఏదైనా చేయాలనే తపన ఉంటే, ఏ సమస్య కూడా మీ మార్గాన్ని ఆపలేదు.. మీరు ఖచ్చితంగా విశ్వాసంతో ముందడుగు వేస్తే.. ఆ పనిని పూర్తి చేస్తారని దీని అర్థం. ధైర్యం, విశ్వాసంతో చాలామంది ఎవరూ ఊహించలేనటువంటి ఇలాంటి పనులు చేస్తారు. మీరు ఖచ్చితంగా ఏదైనా చేస్తారనే విశ్వాసమే మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అలాంటి విశ్వాసానికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు.

ఈ వీడియో పిల్లికి సంబంధించినది. ఇది నదిలో కనిపిస్తుంది. ఒకదగ్గరినుంచి మరోవైపుకి వెళ్లడానికి తీవ్రమైన జంప్ చేస్తుంది. అది అలవోకగా నదిని సంపూర్ణంగా దాటుతుంది. నది ఒడ్డున నిలబడి పిల్లి ఎలా దూకేందుకు ప్రయత్నిస్తుందో మీరు వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. పిల్లి ఇటువైపు నుంచి అటువైపు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లాంగ్ జంప్ చేస్తుంది. చివరకు తాను కోరుకున్న విధంగా అవతలికి చేరుకుంటుంది. మనస్సులో బలంగా అనుకుంటేనే.. ఈ ప్రయత్నం సాధ్యమైందని.. అదే నమ్మకానికి ఉన్న నిదర్శనమని పేర్కొంటున్నారు.

వీడియో.. 

వైరల్‌గా మారిన ఈ వీడియోను నెటిజన్లు.. తెగ ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను IAS అధికారి డాక్టర్ ఎంవీ రావు తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈ వీడియోను పంచుకున్నారు. విశ్వాసం, అల్లరి రెండు కనిపిస్తున్నాయంటూ.. క్యాప్షన్‌లో రాశారు. 45 సెకన్ల ఈ అద్భుతమైన వీడియోను ఇప్పటివరకు 3 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు.

దీంతోపాటు.. చాలా మంది ఈ వీడియోపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. నిజంగా అద్భుతమని.. ఒక యూజర్ పేర్కొనగా.. ఆత్మవిశ్వాసం అంటే ఇదేనంటూ మరొకరు పేర్కొన్నారు.

Also Read:

Road Accident: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఎన్ఆర్ఐ కొడుకు మృతి, కూతురి పరిస్థితి విషమం..

Red Port: మొఘల్ వారసురాలిని నేను.. ఎర్రకోట నాదే అంటూ మహిళ కోర్టులో పిటిషన్.. 170 ఏళ్ళు ఏంచేశారన్న కోర్టు