Viral Video: చిప్పు కొట్టేసిందా బయ్యా.. యాక్సిడెంట్ తర్వాత ఈ యువకుడు ఏం చేశాడో చూడండి..

భూమీద ఇంకా నూకలు ఉండివుంటాయ్ అని మన పెద్దలు సామెతలు చెప్తూ ఉంటారు. ఈ సామెతకు పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ ఇతడు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: చిప్పు కొట్టేసిందా బయ్యా.. యాక్సిడెంట్ తర్వాత ఈ యువకుడు ఏం చేశాడో చూడండి..
Car Accident

Updated on: Jul 01, 2022 | 1:47 PM

Viral Video: భూమీద ఇంకా నూకలు ఉండివుంటాయ్ అని మన పెద్దలు సామెతలు చెప్తూ ఉంటారు. ఆ సామెతకు పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ ఇతడు. తాజాగా ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు భారీ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు బయట పడ్డాడు. కానీ ఆతర్వాత అతను చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో పై నెటిజన్లు రకరకాల కామెంట్లు కురిపిస్తోన్నారు. కొంతమంది రోడ్లపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. రాష్ డ్రైవింగ్ తో ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి వాడే ఇతను కూడా.. ఈ వీడియో ఎక్కడిది, అందులో ఉన్న వ్యక్తి ఎవరు అన్నది తెలియదు కానీ ఈ వీడియో మాత్రం తెగ హల చల్ చేస్తోంది.

రద్దీగా ఉన్న రోడ్డు పై ఓ యువకుడు వేగంగా బైక్ నడుపుతూ వచ్చాడు. ఇంతలో అతడిని ఓ కారు బలంగా ఢీ కొట్టింది. దాంతో అతడు గాలిలోకి ఎగిరి నేలపై పడ్డాడు. అతడి బైక్ నుజ్జు నుజ్జు అయ్యింది. లక్కీగా హెల్మెట్ పెట్టుకున్నాడు కాబట్టి అతనికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే అతడు ప్రవర్తించిన తీరు నెటిజన్లను షాక్ చేసింది. కిందపడిన వెంటనే.. లేచి సైలెంట్ గా పక్కకు నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్లి సడన్ గా స్పైడర్ మ్యాన్ లా ఫోజులు పెట్టడం మొదలు పెట్టాడు. వింత వింతగా ప్రవర్తించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కింద పడటంతో అతడికి పిచ్చి ఎక్కు ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Loading...
Unable to load recommendations.
Follow Us