అసలే లాక్‌డౌన్.. ఆపై వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో.. జనాలందరూ కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనితో ఇంటర్నెట్ వాడకం కూడా బాగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తరచుగా వచ్చే పజిల్స్, ఛాలెంజ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దలు వరకు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫోటో పజిల్స్ అయితే బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఓ పజిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పైన పేర్కొన్న ఫోటోలో రెండో చిరుతపులి ఎక్కడ దాగి ఉందో.! కనిపెట్టేందుకు జనాలు తమ మెదడుకు పని చెబుతున్నారు. ఇక ఆ ఫోటోలో దాగున్న చిరుతను గుర్తించేందుకు నెటిజన్లు పెద్ద సవాల్‌ను ఎదుర్కుంటున్నారు.
How many leopards ? https://t.co/lH3nnwnDhG
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 25, 2021
ఈ ఫోటో ఫోటోషాప్ మ్యాజిక్ అనుకుంటే పొరపాటే.! మోహన్ థామస్ అనే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ తీసిన ఈ ఫోటోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కశ్వన్ ట్విట్టర్‌లో రీ-పోస్ట్ చేశారు. ఓ చిరుతపులి ఎంచక్కా చెట్టుపైన కూర్చుని సేద తీరుతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇందులో చిరుత ఒక్కటే లేదు. చిరుత పిల్ల కూడా దాగుంది. ఫొటోలో దాన్ని కనిపెట్టాలి. నెటిజన్లు మొదటిసారిగా ఈ ఫోటోను చూస్తే.. అది సర్వసాధారణంగా కనిపిస్తుంది. దాని ప్రత్యేకత కూడా ఎవ్వరికీ తెలియదు.
అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో బుల్లి చిరుత పిల్ల ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ చిరుతను గుర్తించేందుకు చాలామంది ప్రయత్నించారు. కానీ చివరికి ఫెయిల్ అయ్యారు. కొంతమంది అయితే.. ఈ ఫోటో మరో చిరుత ఉన్నట్లు భ్రమ కల్పిస్తోందని కామెంట్స్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ వైరల్ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఈ ఫోటోలోని చిరుత పిల్లను కనుగొంటారా.? లేదా.? ట్రై చేయండి.
Spotted it on the first go pic.twitter.com/rPiUkjLbGa
— Anupama Síngh (@GlitterrBird) June 25, 2021
ఇది చదవండి: ఆ ఒక్క చేప లక్షలు తెచ్చిపెట్టింది.. ఎంత ధర పలికిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!