Viral Pic: ఈ ఫోటోలో దాగున్న జంతువును కనిపెట్టండి.. గుర్తించలేకపోయారా? స్టోరీ చదవండి!

Trending Pic: ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా ఎక్కువైపోయింది. వర్క్ ఫ్రమ్ హోం చేసే వ్యక్తులు తరచూ పజిల్స్‌పై దృష్టి సారిస్తున్నారు...

Viral Pic: ఈ ఫోటోలో దాగున్న జంతువును కనిపెట్టండి.. గుర్తించలేకపోయారా? స్టోరీ చదవండి!
Follow us

|

Updated on: Aug 18, 2021 | 10:52 AM

ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వాడకం బాగా ఎక్కువైపోయింది. వర్క్ ఫ్రమ్ హోం చేసే వ్యక్తులు తరచూ పజిల్స్‌పై దృష్టి సారిస్తున్నారు. ‘ఫైండ్ ది ఆబ్జెక్ట్’ పజిల్స్‌ ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. అసలు పేర్కొన్న ఫోటోలో ఏముంది.? ఒకవేళ ఉంటే ఎక్కడుంది.! ఇలా ఆ ఫోటో నెటిజన్లకు సవాల్ విసురుతుంది. అందులో ఉన్న జంతువును కనిపెట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది విజయం సాధించినా.. మరికొందరు ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ఓ ట్రయిల్ వేయండి.

బోర్ ఫీలింగ్‌ను దూరం చేసుకునేందుకు, మెదడుకు పదును పెట్టేందుకు చాలామంది పిక్చర్, వీడియో పజిల్స్‌పై ఆసక్తి కనబరుస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలు. ఎలప్పుడూ ఏవొకటి వైరల్ అవుతాయి. కొన్నిసార్లు పాత పజిల్స్‌ కూడా మరోసారి నెట్టింట హల్చల్ చేస్తుంటాయి. అలాంటి ఓ పిక్చర్ పజిల్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. పైన పేర్కొన్న చిత్రంలో ఓ జంతువు దాగుంది. అదేంటో మీరు కనుక్కోవాలి. మరి లేట్ ఎందుకు ఆ పజిల్‌పై లుక్కేద్దాం పదండి.!

పైన పేర్కొన్న ఫోటో ఏదో అభయారణ్యం లాంటి ప్రదేశంలో తీసిందిగా అనిపిస్తోంది కదూ. అవునండీ కరెక్టే.! ఓ అడవిలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఈ పిక్చర్‌ను తన కెమెరాలో బంధించాడు. ఇందులో ఓ జంతువు దాగుంది. అదెక్కడ ఉందో మీరు గుర్తించాలి. కొంతమంది ఈ పజిల్‌లో గెలిచారు. ఆ జంతువు ఏంటి.? ఎక్కడుందో ఈజీగా కనిపెట్టారు. మీవి డేగ కళ్లయితే ఖచ్చితంగా మొదటి ట్రయిల్‌కే దొరికేస్తుంది. లేదా క్షుణ్ణంగా చూడండి తెలిసిపోతుంది. ఈ ఫోటో మాత్రం ఎలాంటి ఫోటోషాప్ ఇమేజ్ కాదు. పక్కా కెమెరాతో తీసిన ఫోటో ఇది. ఇది పాత ఫోటోనైనా మరోసారి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ఫోటోపై ఓ లుక్కేయండి మరి.!

Tiger 2

సమాధానం: ఆ ఫోటోలో ఉన్న జంతువు పులి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు