సోషల్ మీడియాలో ట్రెండింగ్ కంటెంట్‌కు కొదవలేదు. ఫన్ కోసం కావల్సినంత స్టఫ్ మీకు నెట్టింటే దొరుకుతుంది. వైరల్ ఫోటోలు, ఫన్నీ వీడియోలు.. అలాగే సవాళ్లు స్వీకరించేవారి కోసం పజిల్స్ సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. న్యూస్ పేపర్లతో వచ్చే వీకెండ్ బుక్స్, మ్యాగజైన్లలో ఉండే పజిల్స్, సుడోకోలు ఒక ఎత్తయితే.. ఫోటో పజిల్స్ మరో ఎత్తు. వీటి కోసం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫోటో పజిల్స్ మన మెదడుకు మేత వేయడమే కాకుండా.. కళ్లకు పదును పెడతాయి. అందులో ఏముందో కనిపెట్టాలంటే మన కళ్లల్లో పదును ఉండాల్సిందే. ఇక ఫోటోలో జంతువును గుర్తించే దాకా మనం తగ్గేదేలే అన్నట్లుగా ఆ పజిల్‌ను ఓ పట్టు పడతాం. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. పైన పేర్కొన్న ఫోటోలో ఓ చిరుత దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు నెటిజన్లు తీవ్రంగా కష్టపడుతున్నారు. చెట్టు చుట్టూ గుబురుగా ఎదిగిన పొదల మధ్యలో ఓ చిరుత నక్కింది. దాన్ని కనిపెట్టేందుకు నెటిజన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఈ పజిల్‌ను సాల్వ్ చేయగా.. మరికొందరు ఫెయిల్ అయ్యారు. ఈ ఫోటోలో ఎలాంటి ఫోటోషాప్ మేజిక్‌ను యాడ్ చేయలేదు. ఫోటోగ్రాఫర్ తన కెమెరా పనితనంతో తీసింది మాత్రమే. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి. గుర్తించలేకపోతే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.
Also Read: Viral Video: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి.. ఈ వీడియో చూస్తే పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం..
here is the answer pic.twitter.com/Pzwe4OQlDy
— telugufunworld (@telugufunworld) December 31, 2021