
ఒక ఖైదీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతను తెలివిగా జైలు నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే జైలు ప్రాంగణం వెలుపలికి వెళ్లే మార్గం ఉన్నప్పటికీ, జైలు భవనం చుట్టూ ఎత్తైన కంచెతో పాటు విద్యుత్ ప్రవహించే తీగలు (ఎలక్ట్రిక్ ఫెన్స్) అమర్చబడి ఉంటాయి. ఆ కంచెను తాకితే వెంటనే విద్యుత్ షాక్ తగిలి అతను మరణించే ప్రమాదం ఉంది. ఒక రోజు ఖైదీకి తన స్నేహితుడితో మాట్లాడే అవకాశం లభిస్తుంది. జైలు బయటకు ఎలా తప్పించాలో ఇద్దరూ ఆలోచిస్తారు. కంచెను దాటేందుకు సాధారణ మార్గం లేదని తెలుసుకున్న స్నేహితుడు ఒక తెలివైన ఉపాయం సూచిస్తాడు.
అయితే ప్రతి రోజూ ఆ ఎలక్ట్రిక్ ఫెన్స్‌ను 45 సెకన్ల పాటు ఆఫ్ చేస్తారు. ఆ సమయంలో ఖైదీ జైలు నుంచి తప్పించుకోవాలని అనుకుంటాడు. అయితే అతడు తప్పించుకునే సమయానికి అతని వద్ద ఉన్న వాచ్ పాడై పోయింది. అయితే ఖైదీ వద్ద రెండు ఫ్యూజ్ వైర్లు, ఒక లైటర్ ఉంటాయి. వీటి సహాయంతో కంచె దాటాలని అనుకుంటాడు. సవాలు ఏమిటంటే, ఈ రెండు వైర్లను ఉపయోగించి ఖచ్చితంగా 45 సెకన్లు ఎలా కొలవాలి? ఈ 45 సెకన్లు పూర్తయ్యేలోపు కంచె దాటేందుకు అవకాశం ఉంటుంది. అతని వద్ద ఉన్న ఆ రెండు వైర్లతో ఎలా సమయం ఖచ్చితంగా కొలిచి కంచె దాటుతాడు అనేది అసలు ప్రశ్న? మీరు చెప్పగలరా.. సమాధానం మీకు తెలియకపోతే ఈ కింద తెలుసుకోండి.
ఖైదీ కంచెకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడే ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకుని, అతని వద్ద ఉన్న రెండు ఫూజ్ వైర్ల సాయంతో తప్పించుకోవాలని అనుకుంటాడు. అతని వద్ద ఉన్న ఆ రెండు వైర్లు బయటకు చూస్తే ఒకేలా కనిపిస్తాయి. అయితే వాటికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే ప్రతి ఫ్యూజ్ వైర్ పూర్తిగా కాలిపోవడానికి 60 సెకన్లు అంటే ఒక నిమిషం పడుతుంది. సమస్య ఏమిటంటే, అందుకు 30 సెకన్లను ఎలా కొలవాలన్నది రిడిల్‌లోని అసలు ప్రశ్న. ఖైదీ కొద్దిసేపు ఆలోచించి పరిష్కారాన్ని కనుగొంటాడు. మొదటి వైర్‌ను రెండు చివర్ల నుంచి ఒకేసారి వెలిగిస్తాడు. అదే సమయంలో రెండో వైర్‌ను ఒక చివర నుంచి మాత్రమే వెలిగిస్తాడు. మొదటి వైర్ రెండు వైపుల నుంచి కాలుతున్నందున అది 30 సెకన్లలో పూర్తిగా కాలిపోతుంది.
అప్పటికి రెండో వైర్ ఒక భాగం 30 సెకన్లు మాత్రమే కాలి ఉంటుంది. దాంటో మిగిలిన భాగం కాలిపోవడానికి 30 సెకన్లు మాత్రమే మిగిలి ఉంటుంది. వెంటనే ఖైదీ రెండో వైర్ మరో చివరను కూడా వెలిగిస్తాడు. ఇప్పుడు మిగిలిన భాగం రెండు వైపుల నుంచి కాలడం ప్రారంభిస్తుంది. ఆ మిగిలిన భాగం పూర్తిగా కాలిపోవడానికి ఇంకా 15 సెకన్లు మాత్రమే పడుతుంది. అలా 30 + 15 = 45 సెకన్లు పూర్తవుతాయి. ఖచ్చితంగా 45 సెకన్లు కొలిచిన ఖైదీ సరైన సమయంలో విద్యుత్ కంచెను దాటి జైలు నుంచి తప్పించుకుంటాడు. ఇదే ఈ చిక్కు ప్రశ్నకు తెలివైన పరిష్కారం.
ఈ చిక్కు ప్రశ్నలో అసలు మాయ గణితంలో కాదు, లాజిక్‌లో ఉంది. తర్కశక్తి, సమయ గణన, సమస్య పరిష్కార నైపుణ్యాన్ని పరీక్షించే ఇలాంటి ప్రశ్నలు రోజూ చేస్తే మీ మెదడు చురుకుగా మారుతుంది.