Optical illusion: మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఈ ఫొటోలో ఉన్న క్యాప్‌ను గుర్తించండి చూద్దాం.

| Edited By: Janardhan Veluru

May 13, 2024 | 8:55 AM

ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ ఫామ్స్‌లో ఇలాంటి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోల్లో పర్సనాలిటీ టెస్ట్‌, ఫైండ్ ది ఆబ్జెక్ట్‌ వంటివి ప్రధానమైనవి. పర్సనాలిటీ టెస్ట్‌లో మీరు ఒక ఫొటోను చూసే విధానంపై మీ ఆలోచన ఎలాంటిది.? మీరు ఎలాంటి వారు.? లాంటి విషయాలను అంచనా వేస్తుంటారు...

Optical illusion: మీ కళ్లలో పవర్‌ ఉందా.? ఈ ఫొటోలో ఉన్న క్యాప్‌ను గుర్తించండి చూద్దాం.
Optical Illusion
Follow us on

ఆప్టికల్‌ ఇల్యూజన్ అంటే ప్రతీ ఒక్కరికీ ఆసక్తిగా ఉంటుంది. ఒకప్పుడు సండే మేగజైన్స్‌లో వచ్చే ఆప్టికల్‌ ఇల్యూజన్‌ తాలుకు ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తున్నాయి. సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఇలాంటి ఫొటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.

ముఖ్యంగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి ప్లాట్‌ ఫామ్స్‌లో ఇలాంటి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆప్టికల్‌ ఇల్యూజన్‌ ఫొటోల్లో పర్సనాలిటీ టెస్ట్‌, ఫైండ్ ది ఆబ్జెక్ట్‌ వంటివి ప్రధానమైనవి. పర్సనాలిటీ టెస్ట్‌లో మీరు ఒక ఫొటోను చూసే విధానంపై మీ ఆలోచన ఎలాంటిది.? మీరు ఎలాంటి వారు.? లాంటి విషయాలను అంచనా వేస్తుంటారు. అదే ఫైండ్‌ ది ఆబ్జెక్ట్‌లో మీ కంటి పవర్‌ ఎలాంటిదో చెప్పొచ్చు. తాజాగా ఇలాంటి ఓ ఐ పవర్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఆ ఫొటో ఏంటి.? దాంట్లో దాగి ఉన్న మ్యాజిక్‌ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే మీకు ఏం కనిపిస్తోంది.? ఏముంది ఒక వాష్‌ రూమ్‌, అందులో ఉన్న వస్తువులు అంటారు కదూ! అయితే ఆ వస్తువుల నడుమ ఓ క్యాప్‌ ఉంది. ఆ క్యాప్‌ను గుర్తించడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ అసలు ఉద్దేశం. 15 సెకండ్లలో ఈ క్యాప్‌ను గుర్తిస్తే మీ కంటి పవర్‌ సూపర్ అని చెప్పొచ్చు. అయితే ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయడం అంత సులభమైన విషయం కాదు. చాలా మంది తొలి ప్రయత్నంలో విఫలం చెందినవారే. మరి మీరు సాల్వ్‌ చేశారా.?

అయితే ఓసారి ఫొటోలో ప్లవర్‌ వాజ్‌ను గమనించండి. దాని వెనకాల ఓ క్యాప్‌ దాగి ఉంది. చూశారా.? ఏంటి ఎంత ప్రయత్నించినా పజిల్‌ను సాల్వ్‌ చేయలేకపోతున్నారా. ?అయితే సమాధానం కోసం ఓసారి కింద ఉన్న ఫొటోను చూడండి. సమాధానం మీకే తెలుస్తుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..