
సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోలు కొన్ని నవ్వు తెప్పిస్తుంటే, మరికొన్ని అశ్చర్యపరిస్తాయి. కొన్నిసార్లు కోపాన్ని కూడా తెప్పిస్తుంటాయి. ముఖ్యంగా పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంటాయి. పెళ్లి మండపంలో జరిగిన ఫన్నీ ఘటనలను వీడియో తీసి షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియో ఒక పెళ్లికి సంబంధించినది. ఒక పెళ్లి వేడుక జరుగుతున్న చోట. పెళ్లి సమయంలో జరిగే వరమాల కార్యక్రమానికి వధూవరులు నిలబడ్డారు. వారి కుటుంబ సభ్యులు కూడా వారి చుట్టూ నిలబడి ఉన్నారు. వధువు వేదికపైకి ఎక్కడానికి వరుడు తన చేయిని అందించాడు. కానీ వధువు అతని చేయి పట్టుకోవడానికి నిరాకరిస్తుంది. పెళ్లికూతురు వేదికపైకి రావడానికి నిరాకరించింది. ఒకటి రెండు సార్లు వరుడు ఆమెను తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు. లాభం లేకపోవడంతో చివరికి వరుడు ఆమెను తన ఒడిలోకి ఎత్తుకుని మరీ తీసుకెళ్లాడు.
వరుడు రెండుసార్లు ప్రయత్నించగా వధువు రెండుసార్లు నిరాకరిస్తుంది. ఇంతలో వరుడి అహం దెబ్బతింటుంది. దీని తరువాత వరుడు వేదిక నుండి కిందకు దిగి వధువును తన ఒడిలోకి ఎత్తుకున్నాడు. ఇది చూసి, సమీపంలో నిలబడి ఉన్న వధువు బంధువులందరూ సిగ్గుపడిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియో నైనా యాదన్ అనే ఖాతా నుండి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం జరిగింది. దీనిని ఇప్పటివరకు పది లక్షల మందికి పైగా వీక్షించారు. దీనిపై చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..