పెళ్లి (Wedding) ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకం. తమ పెళ్లిని ఎంతో ఘనంగా.. బంధుమిత్రుల మధ్య సందడిగా చేసుకోవాలని అనుకుంటుంటారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి.. పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా.. పెళ్లి వేడుకలో ఆడిపాడి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వధూవరుల అల్లరి చేష్టలు..గిల్లికజ్జాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి జరుగుతున్న సమయంలో వధువును వరుడు ఆటపట్టించడం కామన్.. కానీ వరుడిని ఓ వధువు భలేగా ఆటపట్టింది. పెళ్లి కూతురు (Bride) చేసిన పనికి వరుడు ముందుగా షాకయిన.. ఆ తర్వాత ఆమె చేసిన చిలిపి పనికి తెగ నవ్వుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇటీవల పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని మాత్రం ఆశ్చర్యంగా.. అయ్యో పాపం అనిపించే విధంగా ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం జరిగింది అనుకుంటున్నారా ? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి తంతు ముగిసిన తర్వాత వధూవరులిద్దరూ దండలు మార్చుకుంటున్నారు. అయితే ఇక్కడ అమ్మాయి ముందుగా అబ్బాయి మెడలో వరమాల వేసింది. ఆ తర్వాత వరుడు వరమాల వేస్తున్న సమయంలో వధువు మెల్లిగా వెనక్కు వంగిపోయింది. అలా వరుడు దండ వేయడానికి ఎంతగా ప్రయత్నించినా వధువు మాత్రం అతడిని ఆటపట్టిస్తూనే ఉంది. చివరకు వరుడి చేత వరమాల వేయించుకుంది. ముందుగా పెళ్లి కూతురు చేసిన పనికి వరుడు షాకయిన.. ఆ తర్వాత ఆమె చేసిన చిలిపి అల్లరి పని చూసి నవ్వుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. వధువు యోగా ఫ్యాన్ అని.. యోగ టీచర్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Suriya: కంఫర్ట్ జోన్లో ఉంటే ఎదుగుదలకు ఫుల్స్టాప్ పడ్డట్లే.. హీరో సూర్య షాకింగ్ కామెంట్స్..
Bigg Boss Non Stop: రాత్రిపూట ఒంటరిగా ఏడ్చేసిన అషూరెడ్డి.. ఎవరు సపోర్ట్ చేయలేదంటూ..