అవినీతి.. అవినీతి.. అవినీతి. ఎక్కడ చూసినా అవినీతే. సర్టిఫికెట్ కావాలన్నా లంచమే.. లోను కావాలన్నా లంచమే.. ఇల్లు కట్టుకోవాలన్నా లంచమే. లంచాలకు మరిగిన అవినీతిపరులు.. అడ్డంగా దోచుకుంటున్నారు. కొందరు టేబుల్ కింది నుంచి తీసుకుంటే.. మరికొందరు బాహాటంగానే చేతులు చాపుతున్నారు.. అవినీతికి ఏ మాత్రం తీసిపోమని చాటుతున్నారు.
ఇదిగో ఇక్కడ చూశారా.. గ్రీన్ కలర్ షర్టులో ఉన్న వ్యక్తిని చూశారా. ఇతను ఓ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేసే హౌజింగ్ అసిస్టెంట్ సవితాదేవి భర్త రాకేష్ కుమార్. భార్య సవితాదేవి ఆఫీసుకు వచ్చే వారి నుంచి లంచాలను డిమాండ్ చేయడం.. వాటిని ఇతను బయట వసూలు చేయడం. బీహార్‌లోని ఔరంగాబాద్‌లో.. ఓ వ్యక్తి తాను కూడా హౌజింగ్ స్కీం కింద ప్రయోజనం పొందాలనుకున్నాడు. ఆ అధికారి లంచం అడగడంతో.. ఎలాగైనా వారిని పట్టించాలనుకున్నాడు. ఓ చోటకు వస్తే డబ్బులిస్తా అనడంతో.. ఆ అధికారి తన భర్తను పంపించింది. అప్పటికే అక్కడ తన ఎవరికీ తెలియకుండా ఓ మిత్రుడిని ఉంచాడు. అధికారి భర్త రాగానే వీడియో తీయాలని చెప్పగా.. ఇదిగో ఇలా డబ్బులు లెక్కపెట్టి ఇస్తుండగా.. మొత్తం రికార్డు చేశాడు. ఆ అవినీతి అధికారి తీరు, ఆమె భర్త బాగోతాన్ని అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. అంతే.. ఔరంగాబాద్‌లో ఇప్పుడీ అవినీతి దంపతులు హాట్‌టాపిక్‌గా మారారు.