బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!

రాత్రిపూట పని నుండి ఇంటికి వెళ్ళడానికి క్యాబ్ లేదా బైక్ బుక్ చేసుకోవడం సర్వసాధారణం. కానీ, మీరు ఒక సాధారణ రైడ్ బుక్ చేసుకుంటే, లక్షల రూపాయల విలువైన మెరిసే బీఎండబ్ల్యూ బైక్‌ మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తే ఎలా ఉంటుంది? ముంబైలో ఇలాంటిదే జరిగింది. ఒక కంపెనీ వ్యవస్థాపకుడు అర్ధరాత్రి ఉబర్ బుక్ చేయగా, రైడర్ తన ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్‌లో వచ్చాడు. వ్యవస్థాపకుడు ఆశ్చర్యంతో అతన్ని ఒక ప్రశ్న అడగ్గా, ఆ రైడర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంది.

బీఎండబ్ల్యూ బైక్‌పై ఉబర్ రైడర్.. బిజినెస్ ఫౌండర్‌కు జీవిత పాఠం చెప్పిన జెన్‌జీ.. నెటిజన్లు ఫిదా!
Bmw Bike Uber Rider

Updated on: Aug 08, 2026 | 12:20 PM

జీవితంలో గొప్ప స్ఫూర్తి, సందేశాలు పెద్ద పెద్ద పుస్తకాలు లేదా మోటివేషనల్ స్పీకర్ల నుంచే రానవసరం లేదు. కొన్నిసార్లు అనుకోకుండా కలిసే అపరిచిత వ్యక్తుల నుంచి కూడా లభిస్తాయి. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, సంస్థ వ్యవస్థాపకుడు ఆశీష్ జైన్‌కు సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. రాత్రి వేళ ఆఫీస్ నుంచి గెస్ట్ హౌస్‌కు వెళ్లడానికి ఆయన ఉబర్ బైక్ రైడ్ బుక్ చేయగా, ఒక యువకుడు ఏకంగా లక్షల విలువైన బీఎండబ్ల్యూ (BMW) బైక్‌పై వచ్చి ఆయనను ఆశ్చర్యపరిచాడు.

రాత్రి 8:25 గంటల ప్రాంతంలో రైడ్ కన్ఫర్మ్ అయిన తర్వాత, తన ముందుకు వచ్చిన బీఎండబ్ల్యూ బైక్‌ను చూసి ఆశీష్ జైన్ మొదట నమ్మలేకపోయారు. ఆసక్తి తట్టుకోలేక, హెల్మెట్ తీసిన ఆ యువకుడిని భాయ్, ఇంత ఖరీదైన బైక్ ఉంచుకుని ఉబర్ ఎందుకు నడుపుతున్నావు? అని ఆశీష్ అడిగారు. దానికి ఆ యువకుడు చిరునవ్వుతో ఇచ్చిన సమాధానం ఆశీష్‌ను ఎంతగానో ఆలోచింపజేసింది.

ఇవి కూడా చదవండి

ఆ యువకుడు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, స్వంతంగా కొన్ని వ్యాపారాలు నడిపాడు. కొన్ని వ్యాపారాలు మంచి లాభాలను ఇస్తే, మరికొన్ని ఫెల్యూర్‌తో విలువైన అనుభవాలను నేర్పించాయి. ఆ సంపాదనతోనే అతడు బీఎండబ్ల్యూ బైక్ కొనుగోలు చేశాడు. త్వరలోనే మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు సిద్ధమవుతున్న ఆ యువకుడికి ఇది తొలి ఉబర్ రైడ్. డబ్బు సంపాదించడం అతని ఉద్దేశం కాదు… సమాజంలోని వివిధ రంగాల ప్రజలను కలవడం, వారితో మాట్లాడటం, వారి ఆలోచనా విధానాలను అర్థం చేసుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు.

ఈ అనుభవాన్ని ఆశీష్ జైన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లింక్డ్‌ఇన్ లో పంచుకుంటూ…ఈ ప్రయాణంలో నన్ను బాగా ప్రభావితం చేసింది ఆ బీఎండబ్ల్యూ బైక్ కాదు, హెల్మెట్ వెనుక ఉన్న ఆ యువకుడి ఆలోచనా విధానం అని రాసుకొచ్చారు. జీవితంలో పెద్ద కలలు కనడంలో తప్పులేదు, వాటిని సాధించేందుకు ఆసక్తి, ధైర్యం ఉంటే చాలని ఈ ఘటన నిరూపిస్తోందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, యువకుడి ఉత్సాహాన్ని, నేర్చుకోవాలనే తపనను నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us